https://oktelugu.com/

‘ఆదిపురుష్’ కు పోటీగా ‘రామాయ‌ణ్‌’.. రాముడిగా మ‌హేష్‌.. హ‌న‌మంతుడిగా బ‌న్నీ?

హిందూ మైథాలజీలో రామాయణాన్ని మించిన అద్భుత కావ్యం మరొకటి లేదు. పూజలందు కోవడంలో శ్రీరాముడిని మించిన దైవాలు లేరు. భక్తులు ఎన్నో విధాలుగా రాముడిని కొలుస్తుంటారు. భార్యకు సరైన భర్తగా.. తండ్రికి తగ్గ తనయుడిగా.. అన్నకు అసలైన ప్రతిరూపంగా.. యుద్ధంలో సిసలైన వీరుడిగా..చివరకు ప్రజల్ని అక్కున చేర్చుకునే రారాజుగా.. ఇలా ప్రతీ విషయంలోనూ శ్రీరాముడితో పోలుస్తుంటారు జనం. అలాంటి రాముడిని విరివిగా వెండి తెరపై చూపించారు ఆనాటి ఫిల్మ్ మేకర్స్. కొన్ని దశాబ్దాల తర్వాత ఇప్పుడు మరోసారి […]

Written By:
  • Rocky
  • , Updated On : February 11, 2021 / 12:49 PM IST
    Follow us on


    హిందూ మైథాలజీలో రామాయణాన్ని మించిన అద్భుత కావ్యం మరొకటి లేదు. పూజలందు కోవడంలో శ్రీరాముడిని మించిన దైవాలు లేరు. భక్తులు ఎన్నో విధాలుగా రాముడిని కొలుస్తుంటారు. భార్యకు సరైన భర్తగా.. తండ్రికి తగ్గ తనయుడిగా.. అన్నకు అసలైన ప్రతిరూపంగా.. యుద్ధంలో సిసలైన వీరుడిగా..చివరకు ప్రజల్ని అక్కున చేర్చుకునే రారాజుగా.. ఇలా ప్రతీ విషయంలోనూ శ్రీరాముడితో పోలుస్తుంటారు జనం. అలాంటి రాముడిని విరివిగా వెండి తెరపై చూపించారు ఆనాటి ఫిల్మ్ మేకర్స్. కొన్ని దశాబ్దాల తర్వాత ఇప్పుడు మరోసారి శ్రీరాముడి జగన్మోహన రూపాన్ని అద్బుతంగా ఆవిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

    Also Read: ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ ఫిక్స్.. ప్రభాస్ తర్వాత ఈ మూవీనే

    ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చలో ఉన్న శ్రీరాముడి చిత్రం ‘ఆదిపురుష్‌’. ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్ట‌ర్‌ ఓం రౌత్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్ మారిన త‌ర్వాత ప్ర‌క‌టించిన నాలుగు భారీ చిత్రాల్లో ‘ఆదిపురుష్‌’ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా నిలిచింది.

    అయితే.. ప్రభాస్ గా రాముడు ఎలా ఉంటాడో.. అసలు కథను ఎలా చెప్పబోతున్నారో.. అని ప్రభాస్ ఫ్యాన్స్ తోపాటు ప్రేక్షకులు చర్చించుకుంటుండగా.. మరో క్రేజీ ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. ‘రామాయణ్’ పేరుతో మరో చిత్రం నిర్మించబోతున్నారని, అందులో టాలీవుడ్ టాప్ స్టార్లు ఉన్నారన్న వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది.

    ఈ చిత్రాన్ని ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మించబోతున్నారని సమాచారం. అయితే.. ఇది ఇప్పటికిప్పుడు ప్ర‌క‌టించిన ప్రాజెక్టు కాదు. ‘రామాయణ్’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు రెండేళ్ల క్రితమే ప్రకటించారు. కానీ.. ప్రభాస్ ‘ఆదిపురుష్’ ప్రకటించడంతో.. ఆ చిత్రం సైలెంట్ అయ్యింది. అయితే.. తాజా సమాచారం ప్రకారం ఆ ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించే పనులు జరుగుతున్నాయని టాక్.

    అంతేకాదు.. ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యిందని తెలుస్తోంది. దీంతో.. కాస్టింగ్‌పై ఫోకస్‌ పెట్టారని సమాచారం. అయితే.. ఇందులో రాముడి పాత్రపై క్రేజీ రూమర్ డిస్కషన్స్ లో ఉంది. ఈ చిత్రంలో రాముడి సూపర్ స్టార్ మహేష్‌బాబుని అనుకుంటున్నట్టు సమాచారం. ఇందులో కూడా రావణుడి క్యారెక్టర్ ను బాలీవుడ్ కే అప్పజెప్తున్నట్టు సమాచారం. ఆ పాత్రలో హృతిక్‌ రోషన్‌ని తీసుకోవాలని చూస్తున్నారట. సీత ను అక్కడి నుంచే ఎంపిక చేస్తున్న మేకర్స్.. దీపికా పదుకొణెను ఫైనల్ చేయాలని చూస్తున్నారట.

    Also Read: మెగా ఫ్యామిలీలో బ్యాండ్ బాజా.. పెళ్లికి సిద్ధమైన యంగ్ హీరో?

    ఇప్పటి వరకూ ఉన్న రూమర్సే చాలా క్రేజీగా ఉంటే.. అంతకు మంచిన క్రేజీ న్యూస్ ఒకటి వినిపిస్తోంది. రాముడు ఉన్నాడంటే తప్పకుండా హనమంతుడు ఉండాల్సిందే. ఆయన లేని రామాయణం ఊహించలేం. మరి, అంతటి ముఖ్యమైన పాత్రలో ఎవరిని తీసుకుంటున్నారంటే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను అనుకుంటున్నారట.

    కాగా.. ఈ చిత్రానికి ‘మామ్‌’ ఫేమ్‌ రవి ఉద్యవార్‌, ‘దంగల్‌’ ఫేమ్‌ నితీష్‌ తివారీ దర్శకత్వం వహించబోతున్నట్టు సమాచారం. నిర్మాతలుగా అల్లు అరవింద్‌, మధుమంతెన, నమిత్‌ మల్హోత్రా ఉండబోతున్నారని తెలుస్తోంది. త్రీడీలో మూడు భాగాలుగా ఈ సినిమాని తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారట మేక‌ర్స్‌.

    మ‌రి, ఈ ‘రామాయణ్’ విషయంలో రూమర్స్ ఎన్ని? ఫ‌్యాక్స్ట్ ఎన్ని అనే సంగ‌తి ఇప్ప‌టి వ‌ర‌కూ తెలియ‌దుగానీ.. చ‌ర్చ‌లో ఉన్న కాంబినేష‌న్ మాత్రం అదుర్స్ అంటున్నారు విన్న‌వాళ్లు. ఈ కాంబో సెట్ అయితే మాత్రం.. పాన్‌ ఇండియా వైడ్ గా థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లడం ఖాయం.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్