Ramam Raghavam Collection: జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్, పాపులారిటీ తెచ్చుకున్న వేణు(Venu Yeldandi), దర్శకుడిగా మారి తీసిన ‘బలగం'(Balagam Movie) చిత్రం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కమెడియన్స్ లో కూడా దర్శకత్వం వహించేంత గొప్ప టాలెంట్ ఉందని ఈ చిత్రంతో నిరూపించాడు. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మరో జబర్దస్త్ కమెడియన్ ధనరాజ్(Comedian Dhanaraj) కూడా డైరెక్టర్ గా మారి ‘రామం..రాఘవం'(Ramam Raghavam Movie) అనే సినిమా చేసాడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ ని దక్కించుకోలేకపోయింది. ధనరాజ్ రాసుకున్న కథ గొప్పదే, అందుకే సముద్ర ఖని(Samudra Khani) లాంటి బిజీ ఆర్టిస్ట్ కూడా ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడు. కానీ స్క్రీన్ ప్లే ని సరిగా నడిపించలేకపోవడం తో, సినిమా కి మిశ్రమ ఫలితం లభించింది. మరో బలగం అవుతుంది అనుకుంటే, ఒక ప్రయత్నం గానే మిగిలిపోయింది పాపం.
కథ ఏమిటంటే ఉద్యోగం చేసి ఇంటి బాధ్యతలు మోసే ఒక నాన్న, బాధ్యతలు లేకుండా జులాయి గా తిరిగే ఒక కొడుకు తెచ్చే సమస్యలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలను బేస్ చేసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు ధనరాజ్. స్టోరీ లో బలం ఉన్నా, ఎమోషన్స్ లో బలం లేకపోవడం తో ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు. దానికి తోడు ధనరాజ్ కి జనాలను థియేటర్స్ కి అప్పించేంత స్టామినా లేదు. ఆయన కేవలం డైరెక్టర్ గా పరిమితమై వేరే యంగ్ హీరో తో ఈ సినిమా చేసి ఉండుంటే వర్కౌట్ అయ్యేదేమో అని అంటున్నారు విశ్లేషకులు. ఓవరాల్ గా ఈ సినిమాకి ఇప్పటి వరకు వచ్చిన వసూళ్లు కేవలం కోటి రూపాయిల గ్రాస్ మాత్రమేనట. ఈ చిత్రాన్ని నిర్మించడానికి దాదాపుగా నాలుగు కోట్ల రూపాయిల ఖర్చు అయ్యింది. భారీ బజ్ ఏర్పడిన సినిమా అయ్యుంటే కనీసం ఓటీటీ రైట్స్ ద్వారా అయినా రికవరీ అయ్యేది. కానీ విడుదలకు ముందు ఈ చిత్రం ఎలాంటి బజ్ ని ఏర్పాటు చేయలేకపోయింది.
ఫలితంగా ఇంకా డిజిటల్ + సాటిలైట్ రైట్స్ కొనుగోలు అవ్వలేదట. ఒకవేళ అవి అమ్ముడుపోయినా నిర్మాత ఆశించినంత డబ్బు వచ్చే అవకాశం లేదు. అలా ఈ సినిమా ఓవరాల్ గా ఒక ఫెయిల్యూర్ గానే మిగిలిపోయింది. ధనరాజ్ లో కచ్చితంగా విషయం ఉంది, కానీ ది బెస్ట్ అనిపించుకునే రేంజ్ కి వెళ్లాలంటే కనీసం రెండు మూడు సినిమాలకు దర్శకత్వం వహించే అనుభవం అయినా ఉండాలి. అయితే ఇదే సినిమాని ఆయన సుడిగాలి సుధీర్ ని హీరోగా పెట్టి తీసుంటే కచ్చితంగా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేది. సుధీర్ కి మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే ఆయన ‘గాలోడు’ లాంటి యావరేజ్ సినిమాని కూడా బ్లాక్ బస్టర్ హిట్ ని చేసి చూపించాడు. ఆయన సినిమాలకు మినిమం రేంజ్ ఓపెనింగ్స్ వస్తాయి. ధనరాజ్ ఆ విధంగా ఆలోచన చేసి ఉండుంటే బాగుండేదని అనిపించింది.