Rama Banam Collections: స్టార్ హీరో రేంజ్ కి ఎదగడానికి కావాల్సిన అన్నీ అర్హతలు ఉన్నా ఇంకా మీడియం రేంజ్ హీరో గానే మిగిలిన నటుడు గోపి చంద్. విలన్ గా జనాల్లో దృష్టిలో నాటుకుపోయినప్పటికీ, ఆ తర్వాత మళ్ళీ హీరో గా మారి హిట్టు మీద హిట్టు కొట్టి సుమారుగా 28 సినిమాలు చేసాడు. ఆయన నటించిన సినిమాలలో ఎక్కువ శాతం సూపర్ హిట్ సాధించినవే, కానీ ఈమధ్య ఎందుకో ఆయనకీ ఏదీ కలిసి రావడం లేద
ముట్టుకున్న ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. చివరికి ఆయన ఎంతో ఇష్టం గా, తనకి బాగా కలిసొచ్చిన డైరెక్టర్ తో చేసిన ‘రామబాణం’ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఫ్యామిలీ మరియు మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కిన ఈ చిత్రానికి మొదటిరోజు మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది.
ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 15 కోట్ల రూపాయలకు జరిగింది.వరుస ఫ్లాప్స్ వస్తున్నప్పటికీ కూడా ఈ స్థాయి బిజినెస్ జరగడాన్ని చూస్తుంటే గోపీచంద్ మీద ట్రేడ్ లో మంచి అంచనాలే ఉన్నాయి. కానీ విడుదల తర్వాత ఆ అంచనాలు తప్పాయి, బ్రేక్ ఈవెన్ కి తగ్గట్టుగా ఒక్క రోజు కూడా వసూళ్లను రాబట్టలేకపోయింది.
ట్రేడ్ పండితులు అందించిన సమాచారం ప్రకారం మొదటి రెండు రోజులకు కలిపి మూడు కోట్ల రూపాయిల షేర్ కి దగ్గరగా వసూళ్లను రాబట్టింది. మొదటి రోజు కోటి 30 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టగా, రెండవ రోజు 80 లక్షల రూపాయిల షేర్, అలాగే మూడవ రోజు 70 లక్షల రూపాయిల వరకు షేర్ వసూళ్లను రాబట్టిందని అంటున్నారు.మొత్తం మీద మూడు రోజులకు కలిపి 2 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టిందని అంటున్నారు ట్రేడ్ పండితులు.