https://oktelugu.com/

Ram Warrior Movie: విడుదలకి ముందే రికార్డ్స్ సృష్టించిన రామ్ ‘వారియర్’.. రామ్ రేంజ్ ఇంతలా పెరిగిందా !

Ram Warrior Movie: యువ హీరోలలో యూత్ మరియు మాస్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో రామ్..ఇతగాడికి మొదటి సినిమా నుండే లేడీస్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ..మొదటి సినిమా దేవదాసు తోనే ఇండస్ట్రీ లో దిమ్మ తిరిగే బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న రామ్..ఆ తర్వాత రెడీ , మస్కా, కందిరీగ వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో మంచి మార్కెట్ ని సంపాదించుకున్నాడు..స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు అనుకుంటున్న […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 20, 2022 / 12:46 PM IST

    Ram Warrior Movie

    Follow us on

    Ram Warrior Movie: యువ హీరోలలో యూత్ మరియు మాస్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో రామ్..ఇతగాడికి మొదటి సినిమా నుండే లేడీస్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ..మొదటి సినిమా దేవదాసు తోనే ఇండస్ట్రీ లో దిమ్మ తిరిగే బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న రామ్..ఆ తర్వాత రెడీ , మస్కా, కందిరీగ వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో మంచి మార్కెట్ ని సంపాదించుకున్నాడు..స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు అనుకుంటున్న సమయం లో వరుసగా డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు అతన్ని కిందకి దించేసాయి..ఇక ఆ తర్వాత చాలా కాలం తర్వాత నేను శైలజ అనే సినిమా తో సూపర్ హిట్ అందుకొని ట్రాక్ లోకి వచ్చిన ఆ రామ్..ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సినిమా తో సెన్సషనల్ హిట్ కొట్టి తన మార్కెట్ ని ఒక్క రేంజ్ లో పెంచేసుకున్నాడు..పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా 38 కోట్ల రూపాయిల షేర్ వరుకు రాబట్టింది..ఈ సినిమా తర్వాత వచ్చిన రెడ్ కూడా యావరేజి టాక్ వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది..ఇప్పుడు ప్రస్తుతం ఆయన హీరో గా నటించిన ‘వారియర్’ సినిమా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నది.

    Ram

    Also Read: KCR Strategies: కేసీఆర్ వ్యూహాత్మక అడుగులు.. ఫాం హౌస్ లో సీక్రెట్ భేటీలు

    తమిళ టాప్ డైరెక్టర్ లింగు స్వామి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి..ఈ సినిమాలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా..ప్రముఖ హీరో ఆది విలన్ గా నటిస్తున్నాడు..వచ్చే నెల 14 వ తేదీన ఈ సినిమా తెలుగు మరియు తమిళం బాషలలో ఘనంగా విడుదల కాబోతుంది..ఇది ఇలా ఉండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ యువ హీరోల సినిమాల్లో ఆల్ టైం రికార్డు సృష్టించే దిశగా దూసుకుపోతుంది..ఈ సినిమాకి కేవలం ఆంధ్ర ప్రాంతం నుండే 18 కోట్ల రూపాయిల రేషియో లో జరుగుతుంది అట..ముఖ్యంగా ఉత్తరాంధ్ర వంటి ప్రాంతాలలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 5 కోట్ల రూపాయలకు జరిగిందట..ఇక రాయలసీమ ప్రాంతం లో అయితే ఈ సినిమా హక్కులు 8 కోట్ల రూపాయిల వరుకు పలుకుతుందని సమాచారం..ఈ స్థాయి బిజినెస్ గతం లో ఏ యువ హీరో కి కూడా జరగలేదు అనే చెప్పొచ్చు..కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపే ఈ సినిమాకి 40 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి..ఇక కర్ణాటక మరియు ఓవర్సీస్ ప్రాంతాలు కలుపుకొని 45 కోట్ల రూపాయిలు బిజినెస్ జరిగిందట..టాక్ వస్తే కేవలం మూడు నాలుగు రోజుల్లోనే ప్రీ రిలీజ్ కి పెట్టిన డబ్బులు మొత్తం వచ్చేస్తాయని డిస్ట్రిబ్యూటర్స్ నమ్మకం తో ఉన్నారు..వాళ్లల్లో ఉన్న నమ్మకం ని చూస్తుంటే ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత రామ్ క్రేజ్ మాస్ లో వేరే లెవెల్ కి వెళ్ళిపోయినట్టు అర్థం అవుతుంది..ఈ సినిమా తర్వాత రామ్ బోయపాటి శ్రీను తో ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు..అఖండ వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి చేస్తున్న సినిమా కావడం తో ఈ సినిమా కి కూడా ట్రేడ్ లో మంచి డిమాండ్ ఉంది..ఇటీవలే షూటింగ్ పూజ కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంబించుకోనుంది.

    Ram

    Also Read: New Job: కొత్త జాబ్.. శృంగార వీడియోలు చూడడమే పని.. జీతం ఎంతంటే?

     

    Tags