ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రామ్ పోతినేని నటిస్తున్న సినిమా రెడ్. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్నారు. ఇదో సస్పెన్స్ థ్రిల్లర్ కం లవ్ ఎంటర్ టైనర్..

తాజాగా టీజర్ రిలీజైంది. టీజర్ ఆద్యంతం అసలేం జరుగుతోంది? అన్న సస్పెన్స్ ఎలిమెంట్ రక్తి కట్టిస్తోంది. ముఖ్యంగా రామ్ ద్విపాత్రాభినయం ఊహకందని ట్విస్టులతో క్యూరియాసిటీ పెంచుతోంది. క్రైమ్ హిస్టరీలో ఇలాంటి కేసు చూడడం ఇదే ఫస్ట్ టైమ్ అంటూ మొదలు పెట్టడం ఆసక్తిని పెంచింది. సిద్ధార్థ్ .. ఆదిత్య ఇద్దరికీ ఎటువంటి సంబంధం లేదు. డిఫరెంట్ డిఫరెంట్ లైఫ్స్.. డిఫరెంట్ వరల్డ్స్ అంటూ లేడీ కాప్ నివేద ఇన్వెస్టిగేషన్ లో చెప్పేసింది కాబట్టి .. రాపో ఒక్కడు కాదు ఇద్దరు అని భావించేందుకే స్కోప్ ఉంది. అయితే ఆ రెండు పాత్రల్లో ఏది నిజం? ఏది అబద్ధం? ఇంకేదో సస్పెన్స్ ఎలిమెంట్ ఉందని ట్రైలర్ ముగింపులో `నేనే` అనే డైలాగ్ తో క్లూ ఇచ్చేశారు? అసలింతకీ ఆ క్లూ వెనక ఫుల్ క్రైమ్ స్టోరీ ఏమిటో తెలియాలంటే థియేటర్లలో సినిమా చూడాల్సిందే. రామ్ కెరీర్ బెస్ట్ లుక్ తో కనిపించబోతున్నాడు ఈ సినిమాలో. రెండు డిఫరెంట్ గెటప్పులతో ట్రైలర్ లో ఎంతో ఎనర్జిటిక్ గా కనిపించాడు. క్రిమినల్ గెటప్ కి.. సాఫ్ట్ వేర్ వేషానికి మధ్య డిఫరెన్స్ ఆకట్టుకుంది. నివేద థామస్, మాళవిక శర్మ, నాజర్, అమృత అయ్యర్ పాత్రల్లో ఇంటెన్సిటీ ఆకట్టుకుంది. ఈ క్రేజీ సినిమాలో రెండు పాటల్ని యూరప్ డోలమైట్స్ .. ఇటలీ పర్వత సానువుల్లో తెరకెక్కించడం ప్రత్యేక ఆకర్షణ. సముద్ర తీరానికి 10 వేలఅడుగుల ఎత్తులో మైనస్ ఐదు డిగ్రీల వాతావరణంలో చిత్రీకరించిన పాట హైలైట్ గా ఉండనుంది.