https://oktelugu.com/

ఇటలీలో రామ్ రోమాన్స్

ఇస్మార్ట్ శంకర్ మూవీతో హీరో రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ఈ మూవీ ఇచ్చిన జోష్ తో రామ్ ‘రెడ్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీలో రామ్ సరసన నివేది పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్ నటిస్తున్నారు. ప్రస్తుతం ‘రెడ్’ చిత్రం పాటల చిత్రీకరణ జరుపుకుంటుంది. దర్శకుడు కిషోర్ తిరుమల ఇటలోని టస్క్, ప్లారెన్స్, డోలోమైట్స్ వంటి అందమైన లోకేషన్లలో పాటలను చిత్రీకరించేందుకు సన్నహాలు చేసినట్లు తెలుస్తోంది. ‘రెడ్’ చిత్రం ఇప్పటికే గోవా, హైదరాబాద్, […]

Written By:
  • Neelambaram
  • , Updated On : February 15, 2020 / 11:34 AM IST
    Follow us on

    ఇస్మార్ట్ శంకర్ మూవీతో హీరో రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ఈ మూవీ ఇచ్చిన జోష్ తో రామ్ ‘రెడ్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీలో రామ్ సరసన నివేది పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్ నటిస్తున్నారు. ప్రస్తుతం ‘రెడ్’ చిత్రం పాటల చిత్రీకరణ జరుపుకుంటుంది. దర్శకుడు కిషోర్ తిరుమల ఇటలోని టస్క్, ప్లారెన్స్, డోలోమైట్స్ వంటి అందమైన లోకేషన్లలో పాటలను చిత్రీకరించేందుకు సన్నహాలు చేసినట్లు తెలుస్తోంది.

    ‘రెడ్’ చిత్రం ఇప్పటికే గోవా, హైదరాబాద్, విశాఖపట్నంలో షూటింగ్ పూర్తి చేసుకుంది. హీరో రామ్, మళవికా శర్మలపై రెండు పాటలను చిత్రీకరించేందుకు చిత్రబృందం ఇటలీకి బయలుదేరి వెళ్లింది. ఈనెల 20వరకు ఇటలోని అందమైన లోకేషన్లలో షూటింగ్ జరుపుకోనుంది. శోభి మాస్టర్ రామ్, మళావిక శర్మలపై తీసే పాటలకు కోరియోగ్రఫీ చేస్తున్నారు. ‘రెడ్’ మూవీకి మణివర్మ అదిరిపోయే బాణీలను సమకూరుస్తున్నారు.

    హీరో రామ్-కిషోర్ తిరుమల కాంబినేషన్లో వచ్చిన ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒక్కటే జిందగి’ మంచి విజయం సాధించాయి. తాజాగా వీరి కాంబినేషన్లో మూడో చిత్రం ‘రెడ్’ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీని కృష్ణ పోతేనిని సమర్పిస్తుండగా శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్లో స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నారు. ఇటలీలో రెండు పాటలు చిత్రీకరించిన తర్వాత చిత్రబృందం హైదరాబాద్ కు చేరుకుంటుంది. హైదరాబాద్ పరిసరాల్లో ఒక పాట చిత్రీకరణతో సినిమా పూర్తికానుందని సమాచారం. త్వరలోనే నిర్మాణాలను కార్యక్రమాలను పూర్తి చేసుకోనుంది. ఏప్రిల్ 9న సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది.