https://oktelugu.com/

The Warrior Collections: ‘ది వారియర్’ ఫస్ట్ వీకెండ్  కలెక్షన్స్..   బాక్సాఫీస్ రిజల్ట్ ఇదే  

The Warrior Collections: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని – దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్‌లో నిన్న రిలీజ్ అయిన సినిమా ‘ది వారియర్’. ఈ సినిమాకి 4 వ రోజు కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. ఈ సినిమాకి మొదటి రోజు నుంచే బాగా నెగిటివ్ టాక్ వచ్చింది. దాంతో, కలెక్షన్స్ బాగా తగ్గాయి. మరి.. ఈ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ ఏమిటి ?, నిర్మాతకు ఏ రేంజ్ లో నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంది. […]

Written By:
  • Shiva
  • , Updated On : July 18, 2022 / 12:56 PM IST
    Follow us on

    The Warrior Collections: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని – దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్‌లో నిన్న రిలీజ్ అయిన సినిమా ‘ది వారియర్’. ఈ సినిమాకి 4 వ రోజు కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. ఈ సినిమాకి మొదటి రోజు నుంచే బాగా నెగిటివ్ టాక్ వచ్చింది. దాంతో, కలెక్షన్స్ బాగా తగ్గాయి. మరి.. ఈ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ ఏమిటి ?, నిర్మాతకు ఏ రేంజ్ లో నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంది. తెలుసుకుందాం రండి.

    ram pothineni

    ముందుగా ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.

    Also Read: Svalbard: వీసా లేకుండానే వెళ్లి సెటిల్ అయిపోయే అందమైన సుందర ప్రదేశం ఏదో తెలుసా?

    నైజాం 4.58 కోట్లు

    సీడెడ్ 2.51 కోట్లు

    ఉత్తరాంధ్ర 2.04 కోట్లు

    ఈస్ట్ 1.11 కోట్లు

    వెస్ట్ 1.02 కోట్లు

    గుంటూరు 1.78 కోట్లు

    కృష్ణా 0.82 కోట్లు

    నెల్లూరు 0.56 కోట్లు

    ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ గానూ రూ. 14.42 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. రూ. 28.95 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

    రెస్ట్ ఆఫ్ ఇండియా 0.78 కోట్లు

    తమిళనాడు 0.80 కోట్లు

    ఓవర్సీస్ 0.55 కోట్లు

    మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ గానూ రూ. 16.55 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది.

    ram pothineni

    ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ గానూ రూ. 33.02 కోట్లను కొల్లగొట్టింది

    ‘ది వారియర్’ చిత్రానికి రూ. 18.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ. 16.23 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ, ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ బట్టి.. ఈ చిత్రం సేఫ్ అయ్యే అవకాశం తక్కువే. రామ్ సినిమాకి ఓపెనింగ్స్ బాగానే వస్తాయి. కానీ ‘ది వారియర్’కి మాత్రం పూర్తి రివర్స్ లో ఉంది పరిస్థితి. ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ కాకపోవడంతో ‘ది వారియర్’ కలెక్షన్స్ పరంగా కూడా నిరాశ పరిచింది.

    Also Read:Happy Birthday Collections: ‘హ్యాపీ బర్త్ డే’ 11 కలెక్షన్స్.. బాక్సాఫీస్ రిజల్ట్ ఇదే

    Tags