The Warrior Collections: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని – దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్‌లో నిన్న రిలీజ్ అయిన సినిమా ‘ది వారియర్’. ఈ సినిమాకి 3వ రోజు కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. ఈ సినిమాకి మొదటి రోజు నుంచే బాగా నెగిటివ్ టాక్ వచ్చింది. దాంతో, కలెక్షన్స్ బాగా తగ్గాయి. మరి.. ఈ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ ఏమిటి ?, నిర్మాతకు ఏ రేంజ్ లో నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంది. తెలుసుకుందాం రండి.
ముందుగా ఈ సినిమా 4 డేస్ కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.
Also Read: Happy Birthday Collections: ‘హ్యాపీ బర్త్ డే’ 10 డేస్ కలెక్షన్స్.. ఎంతొచ్చింది ? ఇంకెంత రావాలి ?
నైజాం : రూ. 4.56 కోట్లు
సీడెడ్ : రూ. 2.56 కోట్లు
ఉత్తరాంధ్ర: 2.38 కోట్లు
ఈస్ట్: .1.26 కోట్లు
వెస్ట్: రూ,.1.74 కోట్లు
గుంటూరు: 1.58 కోట్లు
కృష్ణా : 1.06 కోట్లు
నెల్లూరు:0.91 కోట్లు
ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని మొదటి 4 రోజుల కలెక్షన్స్ గానూ రూ. 16.75 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. రూ. 31.25 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
కర్ణాటక + రెస్టాఫ్ భారత్ :రూ. 1.15 కోట్లు
ఓవర్సీస్ :రూ. 2.45 కోట్లు
మొత్తం అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా 4 రోజుల కలెక్షన్స్ గానూ రూ. 16.95 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది.
ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 4 రోజుల కలెక్షన్స్ గానూ రూ. 33.85 కోట్లను కొల్లగొట్టింది
‘ది వారియర్’ చిత్రానికి రూ. 18.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ. 16.23 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ, మొదటి 4 రోజులకు వచ్చిన కలెక్షన్స్ ను బట్టి.. ఈ చిత్రం సేఫ్ అయ్యే అవకాశం తక్కువే. రామ్ సినిమాకి ఓపెనింగ్స్ బాగానే వస్తాయి. కానీ ‘ది వారియర్’కి మాత్రం పూర్తి రివర్స్ లో ఉంది పరిస్థితి. ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ కాకపోవడంతో ‘ది వారియర్’ కలెక్షన్స్ పరంగా కూడా నిరాశ పరిచింది. ఈ సినిమాకి నష్టాలు రానున్నాయి
Also Read:Cost Of Living in The USA: సండే స్పెషల్: అమెరికాలో నివసించాలంటే మనకు నెలకు ఎంత డబ్బు కావాలి?