India- America: అమెరికా… అగ్రరాజ్యం అందులో వీసమెత్తు సందేహం కూడా లేదు. చైనా మీసం మెలేస్తున్నా, రష్యా ఒకప్పటి ప్రాభవం కోసం పాకులాడుతున్నా.. అమెరికా మాత్రం ఇప్పటికీ ప్రపంచం మీద పెద్దన్న పాత్రే పోషిస్తోంది. కానీ అలాంటి అమెరికా భారత్ కోసం దిగి వచ్చింది. చట్టాల అమల్లో, ఆంక్షల అమలులో కఠినంగా ఉండే అమెరికా భారత్ కు మినహాయింపు ఇచ్చింది. ఇందుకు అమెరికా ప్రతినిధుల సభ ఏకంగా చట్టాన్ని సవరించేందుకు ఒప్పుకుంది.
కాట్సా ఆంక్షల ఎత్తివేత
కౌంటరింగ్ అమెరికా యాడ్వర్సరీస్ త్రూ శాంక్షన్ యాక్ట్( కాట్సా).. స్థూలంగా చెప్పాలంటే అమెరికా విరోధులను ఎదుర్కొనే ఆంక్షల చట్టం. అమెరికా గురించి తెలుసు కదా! సామ్రాజ్యవాదానికి, వ్యాపార వాదానికి నిలువెత్తు రూపం. ఏ దేశమైనా సరే తన కాళ్ళ కిందనే బతకాలనుకునే రకం. బరాక్ ఒబామా కావొచ్చు. డోనాల్డ్ ట్రంఫ్ కావొచ్చు. అధ్యక్షుడు ఎవరైనా కానీ ఆమెరికా ప్రయోజనాల విషయంలో రాజీ అసలు పడరు. ఆ లెక్కకు వస్తే ఎవరినీ ఖాతరు చేయరు. ఆ మధ్య రష్యా, ఇరాన్, ఉత్తరకొరియా ప్రపంచం వివిధ మీ పెత్తనం ఏంటని అమెరికాను ప్రశ్నించాయి కదా! పైగా రష్యా క్రిమియాను ఆక్రమించడం, 2016 అధ్యక్షుడి ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం వంటి పరిణామాలు దృష్టిలో ఉంచుకొని అమెరికా కాట్సా చట్టాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం రష్యా, ఇరాన్, ఉత్తర కొరియాలతో ఆర్థిక సంబంధాలను పెట్టుకోవడం, భారీ రక్షణ ఉత్పత్తులను, వ్యవస్థలను కొనుగోలు చేయకూడదు. ఒకవేళ కొనుగోలు చేస్తే సదరు దేశంపై ఆంక్షలు విధిస్తుంది. ఇప్పటికే రష్యా నుంచి ఎస్ -400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసిన టర్కీ పై కాట్సా కింద ఆంక్షలు విధించింది.
Also Read: Cost Of Living in The USA: సండే స్పెషల్: అమెరికాలో నివసించాలంటే మనకు నెలకు ఎంత డబ్బు కావాలి?
అగ్రరాజ్యం ఇలా ఎందుకు ఆలోచించింది
కాట్సా చట్టం నుంచి భారత్ అమెరికాకే ఎక్కువ లబ్ధి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండో- పసిఫిక్ రీజియన్ లో డ్రాగన్ దేశం దూకుడు ప్రదర్శిస్తోంది. పైగా చైనా అనుసరిస్తున్న విధానాలు అమెరికాకి కంటగింపుగా మారాయి. ఈ నేపథ్యంలో దక్షిణ ఆసియాలో తమకు మద్దతు ప్రకటించే దేశంగా ఉన్న భారత్ ను మరింత బలోపేతం చేయాలని అమెరికా భావిస్తున్నట్టు వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు భారత్ కూడా తనను తాను శక్తిమంతంగా మలుచుకుంటున్న నేపథ్యంలో అమెరికా కూడా ఒకింత తగ్గి ఉండడమే మంచిదన్న భావనలో ఉంది. కాగా డ్రాగన్ అనుసరిస్తున్న పద్ధతులు అటు భారత్ కు, ఇటు అమెరికాకు తలనొప్పిగా మారాయి. సరిహద్దులో చైనా అనుసరిస్తున్న విధానాలను తిప్పి కొట్టాలంటే భారత్ మరింత బలంగా ఉండాలని అమెరికా కోరుకుంటున్నది.
రష్యా నుంచి క్షిపణుల కొనుగోలు
ఇటు చైనా, అటు పాకిస్తాన్, ఇబ్బందికరంగా శ్రీలంక తీరం, బంగ్లాదేశ్ రోహింగ్యాలు.. ఇలా ఎటు చూసుకున్నా భారత్ కి పక్క దేశాలతో ముప్పే ఉంది. ఇలాంటి తరుణంలోనే రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కావలసిన అవసరం ఉంది. అందుకే భారత్ రష్యా నుంచి ఎస్-400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయాలని భావించింది. కానీ అమెరికా కాట్సా చట్టాన్ని తీసుకురావడంతో అందుకు బ్రేక్ పడింది. ఈ క్రమంలోనే భారత్ కు అనుకూలంగా కీలక అడుగుపడింది. ఈ చట్టం నుంచి ఇండియాను మినహాయిస్తూ రూపొందించిన సవరణ చట్టానికి సంబంధించిన బిల్లు అమెరికా ప్రతినిధుల సభలో పాస్ అయింది. ఇండియన్ అమెరికన్ డెమొక్రటిక్ పార్టీ చట్టసభ ఆర్వో కన్నా ప్రవేశపెట్టిన ఈ సవరణ ప్రతిపాదనను మూజువాణి ఓటుతో దిగువ సభ సభ్యులు ఆమోదించారు. దీంతో రష్యా నుంచి భారత్ ఎస్- 400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసే ఒప్పందానికి మార్గం సుగమమైంది.
దీంతో కవ్వింపులకు పాల్పడుతున్న చైనాను కట్టడి చేసేందుకు భారత్ కు అవకాశం లభించినట్టయింది. వాస్తవానికి ఎస్- 400 క్షిపణి వ్యవస్థను రష్యా నుంచి కొనుగోలు చేయాలనే ఆలోచన ఇప్పటిది కాదు. 2018 అక్టోబర్ లోనే సుమారు ₹35 వేల కోట్ల ఒప్పందానికి సంబంధించి సంతకాలు చేసింది. ఎస్ -400 అనేది ఉపరితలం నుంచి గగనతనానికి ప్రయోగించే అత్యంత అధునాతనమైన రష్యా క్షిపణి వ్యవస్థ. రక్షణ రంగంలో దీన్ని పాశుపతాస్త్రంగా భావిస్తారు. ఈ ఒప్పందాన్ని చేసుకున్న తర్వాత అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నేతృతంలోని ప్రభుత్వం కాట్సా చట్టాన్ని ప్రయోగిస్తామని భారత్ కు హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఆ సమయంలో వేచి చూసే ధోరణి అవలంబించిన భారత్.. ట్రంప్ ఓడిపోయిన తర్వాత మళ్లీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందుకు ఇండియన్ అమెరికన్ డెమొక్రటిక్ పార్టీ చట్టసభ సభ్యుడు ఆర్వో ఖన్నాను లైన్ లో పెట్టింది. భారత్ ఎస్ -400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయాల్సిన అవసరాన్ని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ అర్థమయ్యేలా చెప్పడంతో.. ఖన్నా చొరవ తీసుకున్నారు. ఎలాగూ అమెరికా వైస్ ప్రెసిడెంట్ కూడా భారతీయ మూలాలు ఉన్న మహిళ కావడంతో.. ఎందుకు సంబంధించిన మార్గం సుగమమయింది. భారత్ కు మినహాయింపు లభించడంతో చైనా దూకుడుకు కళ్లెం వేయవచ్చని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వైపు ప్రాన్స్ నుంచి కూడా మిగ్ ఫైటర్ విమానాలను భారత్ ఇటీవల కొనుగోలు చేసింది. ఇటు రఫెల్, అటు మిగ్, తాజాగా ఎస్ – 400 ఉపరితల క్షిపణి వ్యవస్థలతో భారత్ చైనా కంటే ఒక అడుగు ముందు వరుసలోనే ఉంది. ఎప్పుడైతే అమెరికా ఈ చట్టానికి సవరణ చేసిందో అప్పుడే చైనా కూడా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లోని తన స్థావరాలను వెనక్కు జరపడం గమనార్హం.
Also Read:BJP- Jharkhand: బీజేపీ తరువాత స్కెచ్ ఆ రాష్ట్రంపైనే.. అలా చేస్తుందన్న మాట