
Ram Pothineni: ఎనర్జిటిక్ స్టార్ గా రామ్ పోతినేని (Ram) తనను తాను బాగానే ప్రమోట్ చేసుకున్నా.. ఎందుకో స్టార్ హీరోగా చలామణి కాలేకపోయాడు. నిజానికి రామ్ కి స్టార్ హీరో అయ్యే అన్ని ఫీచర్స్ ఉన్నాయి. కానీ, రామ్ మాత్రం ఇంకా ఏవరేజ్ హీరో స్థాయికే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే, ఈ మధ్యలో ‘ఇస్మార్ట్ శంకర్’తో తన మార్కెట్ పరిధిని పెంచుకున్నాడు, కానీ.. అంతలోనే రెడ్ అంటూ వచ్చిన హైప్ ను పోగొట్టుకుని.. ఆ స్టార్ డమ్ ను క్యాష్ చేసుకోలేకపోయాడు.
ఇక ఇప్పుడు సినిమాలు హిట్ అయితేనే మళ్ళీ స్టార్ రేసులోకి వెళ్తాడు. అయితే, తన కంటే వెనుక వచ్చిన విజయ్ దేవరకొండ లాంటి హీరోలు కూడా స్టార్ హీరోలుగా క్రేజ్ తెచ్చుకుంటుంటే.. తను మాత్రం ఇంకా మిడిల్ రేంజ్ హీరోగానే ఎందుకు ఉండాలి ? అనేది రామ్ ప్రస్తుత పాయింట్. అందుకే, తాను కూడా ఇక నుంచి విజయ్ దేవరకొండ రూట్ లోనే వెళ్లడానికి కసరత్తులు చేస్తున్నాడు.
విజయ్ దేవరకొండకు హైప్ రావడానికి ముఖ్య కారణాల్లో.. అతను చేస్తోన్న యాడ్స్ కూడా ఒక కారణం. అందుకే, రామ్ కూడా యాడ్స్ పై పట్టు బిగించాడు. దానికి సంబంధించిన ఒక ప్రత్యేక టీమ్ ను కూడా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో రామ్ మరో బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఒప్పుకున్నాడు. ‘CMR Shopping Mall Andhra Pradesh’ బ్రాండ్ కి ఇక పై రామ్ ప్రచారం చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఇప్పటికే రామ్ కొన్ని నేషనల్ లెవల్ బ్రాండ్ క్యాంపెయిన్స్ కూడా చేశాడు. మొత్తానికి బ్రాండ్స్ తో తన బ్రాండ్ లెవల్ ను పెంచుకోవాలనేది రామ్ ఐడియా. అందుకే, తనకు తానుగా కొన్ని బ్రాండ్స్ కు ప్రచారం చేయడానికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ.. మిగిలిన హీరోలు కంటే.. తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటూ ముందుకు పోతున్నాడు.
మరి ఈ నేపథ్యంలో రామ్ చేతిలోకి మరిన్నీ బ్రాండ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక రామ్ ప్రస్తుతం తమిళ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తమిళంలో కూడా మంచి మార్కెట్ తెచ్చుకోవాలని రామ్ ప్లాన్.