
NTR, Mahesh Babu : సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి భేషజాలకూ పోకుండా.. అందరితోనూ మర్యాదగా నడుచుకునే స్టార్ మహేష్ బాబు. తానో అగ్ర నటుడు అయినప్పటికీ.. ఎక్కడా ఆ ఫీలింగ్ ప్రదర్శించడు మహేష్. ఇందుకు ఎన్నో సాక్ష్యాలున్నాయి. కథ పర్ఫెక్ట్ గా ఉంటే.. మల్టీ స్టారర్ చిత్రాలకు కూడా సై అంటాడీ సూపర్ స్టార్. అయితే.. ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మహేష్ బాబు – ఎన్టీఆర్ ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.
మహేష్ బాబు సాధ్యమైనంత వరకూ అందరితో కలిసిపోతాడు. తన చిత్రాల ఫంక్షన్లకు ఇతర హీరోలను కూడా ఆహ్వానిస్తుంటాడు. ఇటీవల విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ఫంక్షన్ కు మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించాడు. అంతకు ముందు ‘భరత్ అను నేను’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ ను పిలిచాడు. ఇలా టాప్ స్టార్లుగా ఉన్నవారు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే.. అప్పుడు అభిమానులకు వచ్చే కిక్కేవేరు.
ఇక, పవన్ – మహేష్ మధ్య కూడా మంచి బాండింగ్ ఉంది. ఇద్దరి వ్యక్తిత్వాలుకూడా దగ్గరగా ఉంటాయి. వీరిద్దరూ రిజర్వుడుగా ఉంటారు. తమ పనేంటో తాము చూసుకుంటారు. అందరినీ గౌరవంగా చూస్తారు. అప్పట్లో అర్జున్ సినిమా సమయంలో పైరసీ సీడీషాపులో జరిగిన గొడవ సందర్భంగా మహేష్ కు మద్దతుగా నిలిచాడు పవన్. అప్పట్నుంచి ఇద్దరూ పరస్పరం గౌరవంగానే ఉంటారు.
ఇప్పుడు కూడా అలాంటి సందర్భం ఒకటి రాబోతోందని టాక్. జూనియర్ ఎన్టీఆర్-కొరటాల కాంబోలో ఒక చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవానికి మహేష్ బాబును ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదేకాకుండా.. మరో న్యూస్ కూడా చక్కర్లు కొడుతోంది.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు?’ షోకు హోస్టుగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో కర్టన్ రైజర్ ఎపిసోడ్ కు రామ్ చరణ్ గెస్టుగా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. త్వరలో మహేష్ బాబు కూడా రాబోతున్నట్టు ప్రచారం సాగుతోంది. నిజానికి ఇప్పటి వరకు మహేష్ ఇలాంటి షోలకు వెళ్లలేదు. మరి, ఏం జరుగుతుంది? నిజంగానే వెళ్తారా? అన్నది చూడాలి.