Ram Pothineni: వరుస ఫ్లాప్స్ ని ఎదురుకుంటూ వస్తున్న హీరో రామ్(Ram Pothineni), రీసెంట్ గానే ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రం తో డీసెంట్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే కమర్షియల్ గా మాత్రం ఈ సినిమా పెద్ద రేంజ్ కి వెళ్లలేకపోయింది అని, ఆ చిత్ర నిర్మాత రవిశంకర్ రీసెంట్ గానే ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో చెప్పడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ చిత్రం తర్వాత రామ్ ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అని ఇప్పుడు ఇండస్ట్రీ లో చర్చలు నడుస్తున్నాయి. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే, ఆయన ప్రముఖ నటుడు / దర్శకుడు సముద్ర ఖని దర్శకత్వం లో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మొదటి నుండి సముద్ర ఖని మంచి దర్శకుడే. కానీ ఆ తర్వాతగా ఆయన మనసు నటన వైపు వెళ్ళింది. నటుడిగా ఆయన కెరీర్ నేడు ఏ స్థానం లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
Also Read: హీరో గా రామ్ గోపాల్ వర్మ..ఫస్ట్ లుక్ తోనే అల్లాడించాడుగా!
అలా నటుడిగా ఫుల్ బిజీ గా ఉన్న ఆయన, చాలా కాలం తర్వాత ‘వినోదయ్యా చిత్తం’ అనే సినిమాతో మరోసారి దర్శకుడిగా రీ ఎంట్రీ ఇచ్చాడు. డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదే చిత్ర కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తో ‘బ్రో ది అవతార్’ గా తెరకెక్కించారు. ఈ చిత్రం అనుకున్నంత రేంజ్ లో ఆడలేదు. ఆడియన్స్ కి ఎందుకో ఇది పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి సరిపడా సినిమా కాదని అప్పట్లో రివ్యూస్ ఇచ్చారు. కానీ ఒక సెక్షన్ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ చిత్రాన్ని ఒక మోస్తారు గా ఆదరించారు. ఫలితంగా 70 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు రామ్ తో చేయబోతున్న సినిమా బ్రో సీక్వెల్ గా తెరకెక్కనుందా?.
బ్రో చిత్రం లో సాయి ధరమ్ తేజ్ ఎలాంటి పాత్రలో అయితే కానిపించాడో, రామ్ కూడా ఇందులో అలాగే కనిపిస్తాడని , దేవుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపిస్తాడని, కేవలం పవన్ కళ్యాణ్ డేట్స్ మాత్రమే బ్యాలన్స్ ఉందని, ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఆయన వద్దకు వెళ్లి కథని వినిపించాలి అంటూ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు సముద్ర ఖని. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఈ ప్రాజెక్ట్ మాకు ఒద్దు బాబోయ్ అంటూ ట్యాగ్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కుతుందో లేదో చూడాలి. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఈ సినిమా ఒప్పుకోకుంటే , రామ్ కూడా ఈ సినిమా చేసే అవకాశం లేదట.