Ram Pothineni: హీరో రామ్ పై పిచ్చి ప్రేమ.. ఆ తండ్రిని ఇలా చేయించింది!

చాక్లెట్ బాయ్ కా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమా నుంచి పూర్తిస్థాయి మాస్ హీరోగా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

Written By: Swathi Chilukuri, Updated On : September 16, 2023 5:37 pm

Ram Pothineni

Follow us on

Ram Pothineni: కొంతమంది హీరోలకు అభిమానులు ఉంటే.. మరి కొంతమంది హీరోలకు వీరాభిమానులు ఉంటారు. తమకన్నా కూడా తమకు ఇష్టమైన హీరోని విపరీతంగా ప్రేమించే వారు ఎంతోమంది. అలాంటి అభిమానులు దొరకడం నిజంగా హీరోలు చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి. ఇక అలాంటి ఒక అభిమానినే సొంతం చేసుకున్నాడు మన యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్.

చాక్లెట్ బాయ్ కా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమా నుంచి పూర్తిస్థాయి మాస్ హీరోగా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రయత్నంలో భాగంగా గత సంవత్సరం తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన ది వారియర్‌ సినిమా మాత్రం ఫ్లాప్ గా మిగిలింది. కాగా ఈసారి ఎలాగైనా సూపర్ హిట్ అందుకోవాలి అని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో స్కంద సినిమా చేస్తున్నారు.

ఈ మధ్యనే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యి మంచి స్పందన తెచ్చుకునింది. ఇక ఈ చిత్రం సెప్టెంబర్‌ 28న తెలుగులో పాటు హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో పాన్‌ ఇండియా మూవీ గా గ్రాండ్‌గా విడదల కానుంది.

ఈ నేపథ్యంలో మన హీరో రామ్ అభిమాని చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.‌ ఇంతకీ ఆ వీరాభిమాని ఏమి చేశారు అంటే.. తన ఫేవరెట్ హీరో రామ్ పైన ప్రేమతో తనకు పుట్టిన బిడ్డకు ‘స్కంద’ అని నామకరణం చేశాడు.

అసలు విషయానికి వస్తే.. హరిహర అనే వ్యక్తికి మన హీరో రామ్‌ పోతినేని అంటే చాలా అభిమానం. ఇక హరిహర కి ఈ మధ్యనే మగబిడ్డ జన్మించారు. తాజాగా నామకరణం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తన కొడుకుకి రామ్ పైన ఉన్న విపరీతమైన ప్రేమతో ‘స్కంద’ అని పేరు పెట్టారు.

ఇక ఈ ఫంక్షన్‌కు రామ్‌ అభిమానులు కూడా హాజరు కావడంతో, ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్ చేస్తూ పోస్టులు పెట్టారు. హీరో రామ్‌ అంటే తనకు చాలా అభిమానమని, అందుకు తన బిడ్డకు స్కంద అని పేరుపెట్టానని ఈ పోస్టులో చెప్పుకొచ్చారు హరిహర. ఇక ఈ పోస్ట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. మరి ఈ విషయం హీరో రామ్ వరకు వెళ్లి ఆయన ఎలా స్పందిస్తారో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాలి.