Ram Pothineni: వరుసగా డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలను ఎదురుకుంటూ వస్తున్న రామ్ పోతినేని(Ram Pothineni), ఈసారి ఎలా అయినా సూపర్ హిట్ కొట్టాలనే కసితో, ‘మిస్ శెట్టి..మిస్టర్ పొలిశెట్టి’ దర్శకుడు పి. మహేష్ బాబు తో కలిసి చాలా కాలం నుండి ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ ని నేడు విడుదల చేయబోతున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఒక సాధారణ యువకుడు, తాను ఎంతగానో ఇష్టపడే హీరో ని కలుసుకునే ప్రయత్నం లో భాగంగా అతను చేసిన ప్రయాణం, ఆ ప్రయాణంలో ఆయనకు ఎదురైనా ఎమోషనల్ మూమెంట్స్ ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇందులో హీరోయిన్ గా భాగ్యశ్రీ భోర్సే నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
అయితే సోషల్ మీడియా లో ఈ సినిమా టైటిల్ లీక్ అవ్వగానే కొన్ని ప్రముఖ ట్విట్టర్ హ్యాండిల్స్ ‘ఆంధ్రా కింగ్’ ఎవరు అని అనుకుంటున్నారు? అంటూ ట్వీట్స్ వేయడం మొదలు పెట్టారు. అత్యధిక శాతం మంది పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), ఎన్టీఆర్(Junior NTR) పేర్లు చెప్పారు. కొంతమంది మహేష్ బాబు పేరు కూడా చెప్పారు. ‘ఆంద్ర కింగ్ తాలూకా’ అనే టైటిల్ ని ‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’ ని ఆదర్శంగా తీసుకొని పెట్టారు కాబట్టి, ఇందులో హీరో రామ్ పవన్ కళ్యాణ్ కి అభిమానిగా నటిస్తున్నాడేమో అని చాలా మంది అనుకున్నారు. మరికొంత మంది ఎన్టీఆర్ అభిమాని అయ్యుంటాడు అంటూ కామెంట్స్ చేసారు. వీళ్లిద్దరు కాదు రామ్ ఇందులో మహేష్ బాబు అభిమానిగా నటిస్తున్నాడని మరికొంతమంది కామెంట్స్ చేసారు. కానీ అసలు ట్విస్ట్ కాసేపటి క్రితమే తెలిసింది. ఈ చిత్రంలో ఆంధ్ర కింగ్ మరెవరో కాదు కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర అట.
రీసెంట్ గానే ఉపేంద్ర కి సంబంధించిన లుక్ టెస్ట్ ని కూడా పూర్తి చేశారట మేకర్స్. ఆయనకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యి. అంటే ఇందులో రామ్ ఉపేంద్ర వీరాభిమాని గా నటించబోతున్నాడు అన్నమాట. ఇంతమాత్రానికి పాపం పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ అభిమానులు రెండు రోజుల నుండి ట్విట్టర్ లో ఆంధ్ర కింగ్ మా హీరో అంటే మా హీరో అంటూ గొడవలు పెట్టుకున్నారు. రామ్ ఇలాంటి గొడవలు వస్తాయనే ఊహించి మన ఇండస్ట్రీ కి సంబంధం లేని వాళ్ళను తీసుకొచ్చారని తెలుస్తుంది. ఉపేంద్ర ని నేటి తరం ఆడియన్స్ మొహం ఎంతగానో ఇష్టపడుంటారు. ముఖ్యంగా యూత్ అయితే ఆయన పాత సినిమాలకు సంబంధించిన సన్నివేశాలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ఉపేంద్ర ని మెచ్చుకుంటూ ఉంటారు. అలాంటి హీరోకి ఆంధ్రా కింగ్ అనే టైటిల్ ని పెట్టినా పెద్దగా వివాదం ఏమి ఉండదని అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి ఈ టైటిల్ ని ఆడియన్స్ ఎలా తీసుకుంటారు అనేది.