Ram Boyapati Movie Title: ‘అఖండ’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి శ్రీను యంగ్ హీరో రామ్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటి వరకు టైటిల్ కూడా అధికారికంగా ప్రకటించకుండానే టీజర్ ని విడుదల చేసారు. రామ్ పుట్టిన రోజు నాడు విడుదల చేసిన ఈ టీజర్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
చూస్తుంటే రామ్ ని ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ కూడా చూపించని రేంజ్ మాస్ యాంగిల్ లో బోయపాటి శ్రీను చూపించినట్టు గా అర్థం అవుతుంది. గుబురు గెడ్డం తో లావుగా చాలా కొత్తగా ఇందులో రామ్ కనిపిస్తున్నాడు. బాలయ్య బాబు తో తప్ప కుర్ర హీరోలతో సక్సెస్ రేట్ తక్కువ ఉన్న బోయపాటి శ్రీను, ఈ చిత్రం తో తాను కుర్ర హీరోలతో కూడా సూపర్ హిట్స్ తియ్యగలను అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ని నేడు ఉదయం 11 గంటల 25 నిమిషాలకు విడుదల చెయ్యబోతున్నారు. అయితే సోషల్ మీడియా లో ముందుగానే ఈ చిత్రం టైటిల్ లీక్ అయిపోయింది. ఈ సినిమాకి బోయపాటి శ్రీను ‘స్కంద’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు సమాచారం. పైత్యానికి అయినా హద్దు అదుపు ఉంటుంది, ఇదేమి టైటిల్ అండీ బాబోయ్ అంటూ అభిమానులు మరియు నెటిజెన్స్ సోషల్ మీడియా లో నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే బోయపాటి శ్రీను చిత్రం టైటిల్స్ విన్నప్పుడు మొదట్లో ఇలాగే అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత అలవాటు అయిపోతుంది. మాస్ కి ఈ టైటిల్ కచ్చితంగా రీచ్ అవుతుంది అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నట్టుగా టైటిల్ అదా కాదా అనేది మరో రెండు గంటల్లో తెలియనుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15 వ తారీఖున గ్రాండ్ గా విడుదల చెయ్యబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.