Shelly Nabu Kumar: సైతాన్.. మహి. వీ. రాఘవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. బీభత్సమైన బోల్డ్ కంటెంట్ తో వర్గం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నది. ఇప్పటికే రికార్డు స్థాయిలో వ్యూస్ నమోదు చేసుకుంది. ఇప్పటివరకు వెబ్ సిరీస్ లలో “మీర్జాపూర్” లోనే గోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉండేది.. అయితే దాన్ని తలదన్నేలా “సైతాన్” వెబ్ సిరీస్ లో రాఘవ్ బోల్డ్ సీన్స్ తెరకెక్కించారు. ఈ సిరీస్ లో బూతులు, అడల్ట్ సీన్స్ లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. ఇదే సమయంలో ఎమోషనల్ సీన్స్ కూడా ఉండడంతో అదే జనాలకు బాగా కనెక్ట్ అయింది.. ఈ వెబ్ సిరీస్ లో బోల్డ్ సన్నివేశాల్లో ఒక నటి ఎటువంటి బెరుకు లేకుండా నటించింది. ఆమె గురించి నెటిజన్లు ఒకటే సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరు? గతంలో ఎన్ని సినిమాలు చేసింది? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అనే ప్రశ్నలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.
సైతాన్ వెబ్ సిరీస్ లో హీరో తల్లిగా సావిత్రి పాత్రలో షెల్లి నబు కుమార్ అలియాస్ షెల్లి కిషోర్ నటించింది. ఆమె 1983 ఆగస్టు 18న దుబాయ్ లో జన్మించింది. మలయాళం లో ధారావాహికల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అక్కడ కుంకుమపువ్వు అనే సీరియల్ లో నటించి విపరీతమైన పాపులారిటీ సంపాదించింది. అంతేకాదు “మిన్నల్ మురళి, తంగ మీన్ కల్ ” లాంటి మలయాళం చిత్రాల్లో కూడా నటించింది. 2006లో ఆమెకు ఉత్తమ నటి అవార్డు కూడా దక్కింది. రాఘవ్ దర్శకత్వంలో వచ్చిన సైతాన్ వెబ్ సిరీస్ లో రెచ్చి పోయి నటించింది. ఇందులో ముగ్గురు పిల్లలకు తల్లిగా ఆమె నటించింది. ఈ వెబ్ సిరీస్ లో ఆమె నటన చాలా బోల్డ్ గా ఉండటంతో నెటిజన్లు ఒకటే సెర్చ్ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ద్వారా గుర్తింపు లభించడంతో ఆమెకు మలయాళం సినిమాల్లో తెగ అవకాశాలు వస్తున్నాయి. అయితే రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న యాత్ర_2 సినిమాలోనూ షెల్లీ నబు కుమార్ నటించే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. బోల్డ్ సన్నివేశాలు నటించేందుకు నబు కుమార్ కు భారీగానే ముట్ట చెప్పారని ప్రచారం జరుగుతోంది.
ఈ వెబ్ సిరీస్ లో కేవలం నబు కుమార్ మాత్రమే కాకుండా ఆమె కూతుళ్లుగా నటించిన వారు కూడా రెచ్చిపోయి అందాలు ప్రదర్శించారు. ఒకానొక దశలో మీర్జాపూర్ అనే వెబ్ సిరీస్ దేనికీ పనికిరాదు అనే స్థాయిలో అందాలు ఆరబోశారు. అదే సమయంలో ఎమోషన్స్ కూడా పండించారు. ముఖ్యంగా పోలీసులను ట్రాప్ చేసి హతమార్చే సన్నివేశాల్లో అయితే జీవించేశారు. అవే ఈ వెబ్ సిరీస్ ను ట్రెండింగ్ లో నిలబెట్టాయి. ఇందులో నటించిన వారికి యాత్ర_2 సినిమాలో రాఘవ్ అవకాశాలు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. అన్ని బాగా కుదిరితే ఈ వెబ్ సిరీస్ కు కొనసాగింపు కూడా ఉంటుందని తెలుస్తోంది.