Homeఎంటర్టైన్మెంట్Chikiri Chikiri Song: 'చికిరి చికిరి' పాట ద్వారా AR రెహమాన్ సంపాదించిన డబ్బులు ఎంతో...

Chikiri Chikiri Song: ‘చికిరి చికిరి’ పాట ద్వారా AR రెహమాన్ సంపాదించిన డబ్బులు ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

Chikiri Chikiri Song: ప్రస్తుతం మన టాలీవుడ్ నుండి తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాల్లో అభిమానులతో పాటు మూవీ లవర్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘పెద్ది'(Peddi). గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) కెరీర్ లో ఈ సినిమాకు ఏర్పడినంత క్రేజ్, ఏ సినిమాకు కూడా ఏర్పడలేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఆయన గత చిత్రం ‘గేమ్ చేంజర్’ ఏకంగా శంకర్ లాంటి డైరెక్టర్ తో చేసినప్పటికీ కూడా అనుకున్నంత హైప్ విడుదలకు ముందు ఏర్పడలేదు. కానీ ‘పెద్ది’ చిత్రానికి ఆరంభం నుండే మంచి క్రేజ్ ఏర్పడింది. ఎందుకంటే రామ్ చరణ్ ‘రంగస్థలం’ తర్వాత రూరల్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న చిత్రం కాబట్టి. దానికి తోడు ఈ చిత్రం నుండి విడుదలైన గ్లింప్స్ వీడియో కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం తో అన్ని భాషల్లోనూ ఈ సినిమా పై క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా AR రెహమాన్(AR Rahman) వ్యవహరించిన సంగతి మన అందరికీ తెలిసిందే. చాలా కాలం తర్వాత ఆయన నుండి వచ్చిన సెన్సేషనల్ చార్ట్ బస్టర్ సాంగ్ ఇది. అయితే ఈ సినిమాని ఒప్పుకున్న తర్వాత AR రెహమాన్ ఆరంభం లో అసలు రెమ్యూనరేషన్ గురించే మాట్లాడలేదట. ఆయనకు కథ నచ్చడం తో వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ‘చికిరి చికిరి’ పాట విడుదల తర్వాత గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేయడం తో నిర్మాతలు పూర్తిగా సంతృప్తి చెందారు. సినిమా కమిట్ అయినప్పుడు ఒక్క పైసా డిమాండ్ చేయలేదు, ‘చికిరి చికిరి’ విడుదల తర్వాత కూడా రెహమాన్ ఒక్క రూపాయి అడగలేదు. మేకర్స్ తన విలువకు తగ్గ రెమ్యూనరేషన్ ఇస్తారులే అనే ధీమా అన్నమాట. అయితే ఈ ‘చికిరి’ పాట గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ సృష్టించడం నిర్మాతలు ఆయనకు 15 కోట్ల రూపాయిల అడ్వాన్స్ చెక్ ఇచ్చారట.

అడ్వాన్స్ చెక్ యే 15 కోట్ల రూపాయిలు అంటే, ఇక పూర్తి రెమ్యూనరేషన్ ఎంత అనేది మీ ఊహలకే వదిలేస్తున్నాం. అందుకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఆయన 28 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇది ఇండియా లోనే మ్యూజిక్ డైరెక్టర్ గా AR రెహమాన్ అందుకుంటున్న అతి పెద్ద రెమ్యూనరేషన్ అని అంటున్నారు. ఒకవేళ అదే కనుక నిజమైతే వేరే లెవెల్ అనే అనుకోవాలి. ఆ 28 కోట్ల రూపాయలతో ఒక సినిమానే తీసేయొచ్చు. చూడాలి మరి రాబోయే సినిమాలకు కూడా AR రెహమాన్ ఇదే రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకుంటాడా లేదా అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version