https://oktelugu.com/

Jagadam Movie: జగడంలో సెకండ్ హీరో రామ్.. మరి అసలు హీరో ఎవరంటే..?

దాంతో అప్పుడే దేవదాసు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రామ్ ను హీరోగా పెట్టి ఈ సినిమా చేశాడు. ఆ స్టోరీ లో ఆ హీరో ఉంటే హీరో తమ్ముడి పాత్రలో రామ్ ను తీసుకోవాలని అనుకున్నాడట..

Written By:
  • Gopi
  • , Updated On : February 21, 2024 / 12:54 PM IST
    Follow us on

    Jagadam Movie: ఆర్య సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సుకుమార్ ఆ సినిమాతోనే సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆ తర్వాత ఎనర్జిటిక్ హీరోగా పేరు పొందిన రామ్ ను హీరోగా పెట్టీ జగడం సినిమా చేశాడు ఇది భారీ డిజాస్టర్ అయింది. అయితే ఈ సినిమాని మొదటగా సుకుమార్ వేరే హీరోతో చేయాలని అనుకున్నాడట, కానీ అది వర్క్ ఔట్ అవ్వలేదట. మొదట మహేష్ బాబు ని హీరోగా పెట్టి ఈ సినిమా చేయాలని అనుకున్నాడట, కానీ కొన్ని కారణాల వల్ల ఈ స్టోరీ మహేష్ బాబు దాకా రీచ్ అవలేదు.

    దాంతో అప్పుడే దేవదాసు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రామ్ ను హీరోగా పెట్టి ఈ సినిమా చేశాడు. అయితే మొదట మహేష్ బాబును హీరోగా అనుకున్నప్పుడు ఆ స్టోరీ ఇది కాదట, ఆ స్టోరీ లో మహేష్ బాబు హీరోగా ఉంటే హీరో తమ్ముడి పాత్రలో రామ్ ను తీసుకోవాలని అనుకున్నాడట, కానీ ఈ సినిమాలో రామ్ హీరోగా మారిపోయి ఈ సినిమా చేయడం వల్లే ఇది పెద్దగా ఆడలేదు అంటూ అప్పట్లో సుకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఇక మహేష్ బాబు హీరోగా చేస్తే ఆ కథ ఇంకోలా ఉండేదని ఈ కథ కోసం ఆయన ఆరు వర్షన్స్ రాసుకున్నారట, అందులో ఒక వర్షన్ రామ్ తో సినిమాగా చేశారు.

    ఒకవేళ ఈ సినిమాలో మహేష్ బాబు కనక చేసినట్లైతే మూడో వర్షన్ ను సినిమాగా తెరకెక్కించేవారట, అది కనక సినిమాగా వస్తే సూపర్ డూపర్ సక్సెస్ అయ్యేదని అప్పట్లో సుకుమార్ దగ్గర వర్క్ చేసేవాళ్లు చెప్పడం విశేషం…ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ తో ఆర్య 2 అనే సినిమా చేస్తున్నాడు.

    ఇక ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. పుష్ప మొదటి పార్ట్ తో బాలీవుడ్ లో తన పాగా వేసిన సుకుమార్ రెండో పార్ట్ తో మరోసారి భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తున్నాడు…