Ram Gopal Varma: ఒకప్పుడు ఇండస్ట్రీలో మూస ధోరణి కథలు ఎక్కువగా నడుస్తూ ఉండేవి అవే సక్సెస్ అవుతూ వచ్చేవి…ప్రేక్షకులకు నచ్చిన నచ్చకపోయిన దర్శకులు అవే సినిమాలు తీసేవారు. ఇక జనాలు సచ్చినట్టుగా ఆ సినిమాలానే చూస్తూ వచ్చారు.
కానీ 1990 వ సంవత్సరంలో రామ్ గోపాల్ వర్మ తీసిన శివ సినిమాతో టోటల్ ఇండస్ట్రీ లెక్కలు మొత్తం మారిపోయాయి. ఒక సినిమాని దర్శకుడు తన పూర్తి ఎఫర్ట్ పెట్టీ తీయగలిగితే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే శివ సినిమాని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఒక ఐదు సంవత్సరాల పాటు శివ సినిమా మానియా ఇండస్ట్రీ మొత్తంలో అలాగే ప్రజల్లో కూడా నడిచింది అంటే ఆ సినిమా ప్రేక్షకుల్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.
ఇక అప్పుడు ఎక్కడ చూసిన రామ్ గోపాల్ వర్మ పేరే వినిపించేది. ఇక ఇలాంటి సమయం లో వర్మ లాంటి దర్శకుడు ఇండస్ట్రీలో మరొకరు లేరు అనేంత గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే శివ సినిమా సమయంలోనే వర్మ నాగార్జున కి క్షణక్షణం స్టోరీని చెప్పాడు. ఆ సినిమా కూడా నాగార్జున తోనే చేస్తానని మాట కూడా ఇచ్చాడు. కానీ కట్ చేస్తే క్షణక్షణం సినిమాని వెంకటేష్ తో చేసి నాగార్జునకు పెద్ద షాక్ ఇచ్చాడు. అయితే ముందుగా ఆ కథకి నాగార్జున సెట్ అవుతాడని అనుకున్నప్పటికీ ఆ సినిమాలో హీరో సినిమా మొత్తం ట్రావెల్ చేస్తూ ఉంటాడు కాబట్టి దానికి నాగార్జున కంటే వెంకటేష్ అయితే బాగా సెట్ అవుతాడనే ఉద్దేశ్యం తోనే వర్మ వెంకటేష్ తో ఈ సినిమా చేశానని నాగార్జున తో క్లారిటీగా చెప్పాడట.
ఇంకా దాంతో నాగార్జున కూడా కామ్ అయిపోయాడు. ఇక ఆ తర్వాత కూడా వీళ్ళ కాంబో లో కొన్ని సినిమాలు వచ్చాయి. మొదటి నుంచి కూడా రామ్ గోపాల్ వర్మ కి, నాగార్జునకి మధ్య మంచి బాండింగ్ అయితే ఉంది. అందువల్లే వాళ్ళిద్దరూ చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఇక రీసెంట్ గా వర్మ నాగార్జునతో ఆఫీసర్ అనే సినిమా చేశాడు. ఆ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ వాళ్లిద్దరి మధ్య ఎక్కడ కూడా ఫ్రెండ్షిప్ చెడిపోకుండా ఇప్పటికే అలానే కొనసాగుతుంది…ఒక్