https://oktelugu.com/

అలాగైతే రోజూ వంద మంది చనిపోవాలంటున్న ఆర్జీవీ

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు బంధుప్రీతే కారణమని వస్తున్న ఆరోపణలను సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఖండించాడు. ఇండస్ట్రీలో వారసత్వ నటులని పరిచయం చేస్తున్న కరణ్ జొహార్ను టార్గెట్‌ చేసి వివర్శలు చేయడానని తప్పుపట్టాడు. తమ బంధువులకు అవకాశం ఇస్తే తప్పేంటన్నారు. బంధుప్రీతి లేని రంగం ఏమిటని ఆయన ఎదురు ప్రశ్నించాడు. బంధుప్రీతి లేకపోతే ఈ సమాజం కుప్పకూలుతుందన్నాడు. కరణ్ కు మద్దతు పలుకుతూ వరుస ట్వీట్స్‌ చేయడం చర్చనీయాంశమైంది. ‘నెపోటిజం […]

Written By: , Updated On : June 17, 2020 / 02:56 PM IST
Follow us on


బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు బంధుప్రీతే కారణమని వస్తున్న ఆరోపణలను సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఖండించాడు. ఇండస్ట్రీలో వారసత్వ నటులని పరిచయం చేస్తున్న కరణ్ జొహార్ను టార్గెట్‌ చేసి వివర్శలు చేయడానని తప్పుపట్టాడు. తమ బంధువులకు అవకాశం ఇస్తే తప్పేంటన్నారు. బంధుప్రీతి లేని రంగం ఏమిటని ఆయన ఎదురు ప్రశ్నించాడు. బంధుప్రీతి లేకపోతే ఈ సమాజం కుప్పకూలుతుందన్నాడు. కరణ్ కు మద్దతు పలుకుతూ వరుస ట్వీట్స్‌ చేయడం చర్చనీయాంశమైంది. ‘నెపోటిజం అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో కరణ్ జొహర్‌ను విమర్శించే వాళ్లు ఒక్కరి కూడా పని ఇవ్వలేరు. కానీ, కరణ్, ఏక్తా కపూర్, ఆదిత్య చోప్రా లాంటి వాళ్లు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ రాద్ధాంతం ముగిసిన తర్వాత ఎంతో మంది న్యూకమర్స్‌ వారి ఆఫీసుల ముందు క్యూ కడుతారు. అయినా సినీ పరిశ్రమ ఎలా నడుస్తుందో తెలియకే ఇలాంటి విమర్శిస్తున్నారు. సుశాంత్ తో ఇబ్బంది ఉన్నప్పుడు అతనితో పని చేయాలా, వద్దా అనేది కరణ్ సొంత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఎవరితో కలిసి పని చేయాలనేది ప్రతి నిర్మాత సొంత నిర్ణయం. అయినా డబ్బు, పేరు వచ్చిన 12 ఏళ్ల తర్వాత కూడా ఇండస్ట్రీ నుంచి వెలివేయ బడ్డ వ్యక్తిగా భావించి సుశాంత్ ఆత్మహత్య చేసున్నట్టయితే.. అతని దరిదాపుల్లోకి కూడా రాలేకపోయిన వ్యక్తులు రోజుకు కనీసం 100 మంది తనువు చాలించాలి’ అని పేర్కొన్నాడు.

కేవలం తనను బయటి వ్యక్తిగా చూస్తూ పార్టీలకు ఆహ్వానించకపోవటం వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని చెపుతున్నారని, అలాంటప్పుడు కాళ్లకు చెప్పులు కూడా లేకుండా, ఖాళీ కడుపులతో నడుస్తున్న కోట్లాది మంది వలస కార్మికులు ఎన్నోసార్లు ఆత్మహత్య చేసుకునేవాళ్లు అని అభిప్రాయపడ్డాడు. అయినా బంధుప్రీతి లేనిదెక్కడ అని ప్రశ్నించాడు. ‘ ములాయం, ఉద్ధవ్ థాక్రే వంటి రాజకీయవేత్తలు తమ కుమారులు, బంధువులకు ప్రాధాన్యత ఇచ్చినట్టుగా.. ముఖేశ్, అనిల్ కు ధీరూబాయ్ అంబానీ డబ్బు ఇచ్చినట్టుగా… అన్ని కుటుంబాలు తమ సొంత వ్యక్తులకు ప్రాధాన్యత ఇచ్చినట్టు… బాలీవుడ్ కుటుంబాలు కూడా వారి సొంత వ్యక్తులకు అదే ప్రాధాన్యతను ఇచ్చాయి. బంధు ప్రీతి లేకుంటే ఈ సమాజం మొత్తం కుప్పకూలిపోతుంది. ఇది సమాజంలో అంతర్భాగం’ అని ఆర్జీవీ వరుస ట్వీట్స్‌లో రాసుకొచ్చాడు.