RGV Controversy: ‘‘ప్రస్తుతం ఇక ‘అల్లు’నే కొత్త మెగా హీరో. అవును, ఇది వినడానికి కాస్త కష్టంగా ఉన్నా ఇదే పచ్చి నిజం’’ అంటూ మళ్లీ కొత్తగా వివాదాన్ని రెచ్చగొట్టే ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు ఆర్జీవీ. వర్మ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం ట్విట్టర్ లో చర్చనీయాశంగా మారింది. అసలు వర్మ ఏ ఉద్దేశంతో ఈ ట్వీట్స్ చేస్తాడో తెలియదు గానీ, అభిమానుల్లో మాత్రం గందరగోళాన్ని సృష్టిస్తాడు. అసలు ఈ ఆర్జీవీకి ఏమి కావాలి ? ఎందుకు అనవసరంగా అందర్నీ కెలుక్కుంటూ ఉంటాడు ?

ఆర్జీవీ సినిమాల కోసం పుట్టాడా ? లేక, జనాన్ని వేధించడానికి పుట్టాడా ? అంటూ ఆర్జీవీ పై ప్రత్యేక పోల్స్ ను కూడా క్రియేట్ చేస్తున్నారు అంటే.. వర్మ పైత్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే, గత కొన్ని రోజులుగా ఆర్జీవీ అల్లు అర్జున్ ను బాగా ప్రమోట్ చేస్తున్నాడు. అవసరం ఉన్నా లేకపోయినా.. బన్నీ ప్రస్తావన తెచ్చి మరీ.. బన్నీ పాన్ ఇండియా స్టార్ అంటూ ఏవేవో మాటలు చెప్పి.. మొత్తానికి బన్నీని బాగా హైలైట్ చేస్తున్నాడు.
Also Read: పుష్ప మూవీలోని మొగిలీస్ పాత్ర పోషించింది ఎవరో తెలుసా..?
టాలీవుడ్ లో గొప్ప టాలెంట్ ఉన్న ఏకైక వ్యక్తి అంటూ బన్నీ గురించి వర్మ ఇప్పటికే చాలాసార్లు స్పీచ్ లు ఇచ్చాడు. అయినా, ఎవరి గురించి ఎప్పుడు పాజిటివ్ గా మాట్లాడతాడో, ఎవరి గురించి ఎప్పుడు బ్యాడ్ గా ప్రమోట్ చేస్తాడో వర్మకే తెలియదు. అందుకే, వర్మ గొంతు చించుకుని మరి బన్నీ గురించి పోగుతున్నా.. బన్నీ ఫ్యాన్స్ కూడా పట్టించుకోవడం లేదు. దాంతో వర్మ ఆశించే పబ్లిసిటీ ఆ స్థాయిలో ఆర్జీవీకి దొరకడం లేదు.
RGV’s deleted tweets yesterday 🔥@alluarjun ⭐ pic.twitter.com/kRMZdhOTjP
— Proud AADHF (@ProudAADHF) January 18, 2022
అయితే, వర్మ అందరి లాంటోడు కాదు. గతంలో వర్మ గురించి త్రివిక్రమ్ సినిమాలో ఒక డైలాగ్ ను ఉదాహరణగా చెప్పుకున్నాం. ఒక చెట్టు మీద మామిడి కాయ ఉంది. చెట్టు కింద ఒకడు దేనికోసమో వెతుకుతూ ఉంటాడు. పైన పండు వదిలేసి కింద వేరే దేని కోసమో వెతుకుతున్నాడు పిచ్చోడు అని అందరూ అనుకుంటారు. కానీ వాడు ఆ పండుని కొట్టడానికి రాయి కోసం వెతుకుతున్నాడు.
Also Read: ఇకపై ‘చిరు మేనల్లుడు బన్నీ కాదు… బన్నీ మేనమామ చిరు’ అట!
కరెక్ట్ గా చెప్పుకుంటే ఇలాంటి పరిస్థితే ఆర్జీవీది కూడా. దారిన పోయే వారి కన్నా ఎంతో క్లారిటీ గా, ఫోకస్డ్ గా తనకు కావాల్సిన పని చేసుకుంటూ పోతున్నాడు ఆర్జీవీ. అంతేగాని, దారిన పోయే దానయ్యలను, లేక పని చేసుకునే పాపయ్యలను ఆర్జీవీ పట్టించుకోడు. ఏది ఏమైనా ఆర్జీవీ గత వైభవం తిరిగి రానట్టే. అయితే, ఆర్జీవీ సినిమాలు ప్లాప్ అవ్వొచ్చు, కానీ ఆర్జీవీ ఎప్పుడు సక్సెసే.