Megastar Chiranjeevi: మెగా కుటుంబం అంటే ఒకరికి ఒకరు బాగా సపోర్ట్ చేసుకుంటారు అనే పేరు ఉంది. సినిమా హిట్టైనా.. ఫ్లాప్ అయినా ఆ సినిమా గురించి అందరూ పాజిటివ్ గానే మాట్లాడుకుంటారు. పైగా ఆ సినిమాను దగ్గరుండి ప్రమోషన్ చేస్తారు. అలాంటిది మెగా ఇంటిల్లుడి సినిమాని అస్సలు పట్టించుకోలేదు. కారణం.. కళ్యాణ్ దేవ్ ను, మెగా డాటర్ శ్రీజ దూరం పెట్టింది అని వార్తలు వినిపిస్తున్నాయి. కళ్యాణ్ దేవ్ – శ్రీజ మధ్య అస్సలు పొసగడం లేదంటూ పుకార్లు వైరల్ అవుతున్నాయి.

మెగా డాటర్ మరోసారి విడాకుల వైపు అడుగులు వేసిందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే శ్రీజ, తన పేరు నుంచి కళ్యాణ్ దేవ్ పేరును తీసేసింది. భర్తకు దూరం అవుతున్నట్లు ఆమె ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చింది. అప్పట్లో సమంత కూడా మొదట ఇలాగే చేసింది. తన పేరుకు ముందు ఉన్న అక్కినేని పేరును ఆమె తీసేసింది. ఆ తర్వాత అక్కినేని కుటుంబానికి దూరం అయింది.
Also Read: ప్చ్.. అమితాబ్ లో తర్వాత మళ్ళీ గల్లా అశోక్ లోనే చూశాడట !
ప్రస్తుతం శ్రీజ పరిస్థితి కూడా అదే అని తెలుస్తోంది. కళ్యాణ్ దేవ్ పేరు తొలగించింది కాబట్టి, అలాగే కళ్యాణ్ దేవ్ సినిమాను మెగా కుటుంబం అస్సలు పట్టించుకోలేదు కాబట్టి.. మొత్తమ్మీద ఈ వ్యవహారం ఇంతటితో ముగిసేలా లేదు. అధికారిక విడాకుల ప్రకటన వచ్చే వరకూ గాసిప్ రాయుళ్లకు మంచి స్టప్ దొరికినట్లు అయింది. ఆల్ రెడీ సోషల్ మీడియాలో శ్రీజ, కళ్యాణ్ పేరు ట్రెండింగ్ అవుతూనే ఉన్నాయి.

పాపం, హీరోగా స్టార్ డమ్ తెచ్చుకుని ట్రెండింగ్ అవుదామని ఆశ పడిన కళ్యాణ్ దేవ్.. చివరకు ఇలా ట్రెండింగ్ అవ్వాల్సి వస్తోంది. ఇక శ్రీజ, కళ్యాణ్ దేవ్ వ్యవహారం చిరంజీవిని బాగా బాధించింది అట. శ్రీజ అంటే ఆయనకు ప్రాణం. ఆమె సంతోషంగా ఉండాలని చిరు ఎప్పుడూ ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. అలాంటిది ఆమెకే ఇలా జరగడంతో చిరు బాగా ఫీల్ అవుతున్నారట.
ఎందుకంటే శిరీష్ గతంలో భరద్వాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొన్నేళ్ళకు అతనితో విడిపోయింది. ఆ తర్వాత ఏడేళ్ల తర్వాత మెగాస్టార్ దగ్గర ఉండి మరీ శ్రీజకు కళ్యాణ్ దేవ్ ను ఇచ్చి రెండో పెళ్లి చేసారు. ఇప్పుడు కళ్యాణ్ దేవ్ విషయంలోనూ శ్రీజ అన్ హ్యాపీ గా ఉండటం కన్నీళ్లు పెట్టుకునేలా చిరుని బాగా బాధిస్తోంది.
Also Read: నీ పెంపకం మీద అనుమానం వస్తుంది – అనసూయ