Bigg Boss Telugu 6 Shrihan: గత బిగ్ బాస్ 5వ సీజన్ లో కంటెస్టెంట్ సిరి రోమాన్స్ హైలెట్ అయ్యింది. షణ్ముఖ్ జశ్వంత్ తో ఆమె చేసిన రోమాన్స్ ఇప్పటీకీ ఎవరూ మరిచిపోలేదు. సిరికి ఆల్ రెడీ బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ ఉన్నా కూడా ఆమె తగ్గకుండా షణ్ముక్ తో అల్లుకుపోవడం దుమారం రేపింది.
ఈసారి కూడా బిగ్ బాస్ 6లో బోలెడంత మంది అమ్మాయిలను,అబ్బాయిలను తెచ్చిపడేశారు. ఇందులో సిరి బాయ్ ఫ్రెడ్ శ్రీహాన్ కూడా ఉన్నాడు. హౌస్ లోకెల్లా అందమైన కుర్రాడిగా కనిపిస్తున్నాడు. అతడు ఏ అమ్మాయితో క్లోజ్ అవుతాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆర్జే సూర్య తాజాగా శ్రీహాన్ ను మరో అమ్మాయితో లింక్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఆరోహి హౌస్ లో ఎక్కువగా శ్రీహాన్ తో క్లోజ్ కావడానికి ప్రయత్నిస్తోందని.. అతడితోనే ప్రేమగా మాట్లాడుతోందని సూర్య లాజిక్ బయటకు తీశాడు.
శ్రీహాన్ తో క్లోజ్ గా ఉంటున్న ఆరోహీని చూసి ఆర్జే సూర్య కామెంట్ చేస్తాడు. దీనికి ఆరోహి నవ్వుతూనే కౌంటర్ ఇస్తుంది. ఇలా అంటే అస్సలు ఊరుకోనని.. ఉరికించి కొడుతానని సూర్యకు వార్నింగ్ ఇస్తుంది.
దీన్ని బట్టి ఆరోహీ, శ్రీహార్ మధ్యన ఏదో మొదలైందని అర్థమవుతోంది. వీరి ట్రాక్ పట్టాలెక్కిందని అంటున్నారు. ఇదే జరిగితే బయట ఉన్న శ్రీహాన్ ప్రియురాలు సిరి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Also Read:Eesha Rebba Marriage: పెళ్లి పీటలు ఎక్కబోతున్న తెలుగు హీరోయిన్.. వరుడు ఆ స్టార్ డైరెక్టరే