Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు వివాదానికి విడదీయరాని సంబంధం ఉంది. వివాదం వర్మ నీడగా ఉంటుంది. ఆయన సినిమాలకు అదే ప్రధాన పెట్టుబడి. పది లక్షల బడ్జెట్ తో వివాదాస్పద సినిమా తీసి కోట్లు రాబట్టడం వర్మ మార్కెట్ మంత్రం. తన స్వార్ధం కోసం ఇతరుల జీవితాలలో పేకాడుకుంటారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై సినిమాలు తీసి పబ్బడం గడుపుకుంటారు. తన స్వలాభం కోసం ఆడపిల్లల మానం, అభిమానంపై కూడా సినిమాలు తీసి క్యాష్ చేసుకుంటాడు. ఇక తనకు ఫీలింగ్స్ లేవని, నా సుఖం నాదే. న స్వార్ధం నాదే అంటాడు. ‘తల్లీ చెల్లీ ఏ గల్లీలో లేని సిల్లీ నా కొడుకుని’ అని మోహన్ బాబు చెప్పిన డైలాగ్ వర్మకు వంద శాతం వర్తిస్తుంది.
అలాంటి వర్మ చిత్ర పరిశ్రమ కోసం ఉద్యమం చేపట్టారు. టికెట్స్ ధరల తగ్గింపు పై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, మంత్రులను నేరుగా ప్రశ్నిస్తున్నారు. తన తెలివితేటలతో కోర్టులో న్యాయవాదిలా సోషల్ మీడియాలో ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టాడు. రాజనీతిశాస్త్రం వల్లిస్తూ.. ఆర్ధిక సూత్రాలు గుర్తు చేస్తూ లాజిక్స్ మాట్లాడుతున్నాడు. సినిమా ధరల పై ప్రభుత్వ నియంత్ర ఉండడకూడదు, ఇది డిమాండ్ సప్లై సూత్రానికి వ్యతిరేకం. సినిమా అనేది నిత్యావసర వస్తువు కానప్పుడు ధరల నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదంటున్నారు.
అదే సమయంలో ఇండస్ట్రీ తరపున అందరూ మాట్లాడాలి అంటున్నారు. ఇప్పుడు మాట్లాడకపోతే ఎప్పుడూ మాట్లాడలేరని… టికెట్స్ ధరలపై కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. వరుస డిబేట్లలో పాల్గొంటూ చాలా సీరియస్ గా ఈ విషయంపై పోరాడుతున్నాడు. ఇది వర్మ నైజానికి పూర్తిగా విరుద్ధం. వర్మ ఎప్పుడూ నలుగురి ప్రయోజనం కోసం పోరాడడు. పోనీ చిత్ర పరిశ్రమ ద్వారా ఎదిగినవాడిగా అభిమానంతో చేస్తున్నాడనుకుంటే.. ఆయనకు అలాంటి కృతజ్ఞతా భావం ఉండదు. ఈ విషయాన్ని వర్మ చాలా సందర్భాల్లో చెప్పారు.
Also Read: ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఉండాలనుకోవడం మూర్ఖత్వం అంటున్న ఆర్జీవీ… టార్గెట్ అతనేనా ?
కాదు సినిమా టికెట్స్ ధరల తగ్గింపు వలన ఆయన సినిమాలకు నష్టం జరుగుతుందా అంటే ఆ ఛాన్సే లేదు. వర్మ స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలు చేయరు. అప్ కోర్స్ ఆయన చేస్తానన్నా… ఇప్పుడున్న ఆయన ఇమేజ్ రీత్యా ఎవరూ చేయరు. ఇక ఆయన తెరకెక్కించే లక్షల బడ్జెట్ చిత్రాలకు థియేటర్స్ అవసరమే లేదు. ఆయనకు ఆర్జీవీ వరల్డ్ పేరిట ఓన్ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ఉంది. వ్యయప్రయాసలకోర్చి థియేటర్స్ లో విడుదల చేయడం కంటే.. వర్మ చిత్రాలకు డిజిటల్ స్ట్రీమింగ్ చక్కగా సెట్ అవుతుంది.
ఏ విధంగా చూసినా ఒక స్వార్ధపరుడిగా వర్మ సినిమా టికెట్స్ ధరలపై పోరాడాల్సిన అవసరమే లేదు. అయినప్పటికీ ఈ సమస్యను ఆయన తనదిగా భావిస్తున్నారు. తన పోరాటం ముందుకు తీసుకెళుతున్నారు. ఇక వర్మ తీరు చూసిన పలువురు.. ఆయన నలుగురి కోసం పోరాడే గుణం ఎప్పుడు అలవర్చుకున్నారు. వర్మలో సడన్ గా వచ్చిన ఈ మార్పుకు కారణమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా మార్పు మంచిదే.
Also Read: ‘టికెట్ ధరల’ పై ఆర్జీవీ లోతైన విశ్లేషణలు !