RGV : నేను కోతిని.. ఇట్లుంటది రాంగోపాల్ వర్మ దీపావళి సెలబ్రేషన్స్.. వైరల్ వీడియో

RGV :  దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా ప్రత్యేకమే. అందరిలా నేను ఉండను అంటాడు. అనడమే కాదు ఆచరిస్తాడు. సమాజం, చుట్టాలు, జనాలు ఏమనుకుంటారో అనే పట్టింపు లేదు. మనకు నచ్చినట్లు బ్రతకడమే జీవితం అని గట్టిగా నమ్ముతాడు. ఒకప్పుడు దేశం మెచ్చిన దర్శకుడిగా ఉన్న రామ్ గోపాల్ వర్మ మై లైఫ్ మై రూల్స్ అంటూ తిక్క తిక్క పనులు చేస్తుంటాడు. తాజాగా దీపావళి వేడుకలు కూడా భిన్నంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. సదరు […]

Written By: NARESH, Updated On : November 13, 2023 1:29 pm
Follow us on

RGV :  దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా ప్రత్యేకమే. అందరిలా నేను ఉండను అంటాడు. అనడమే కాదు ఆచరిస్తాడు. సమాజం, చుట్టాలు, జనాలు ఏమనుకుంటారో అనే పట్టింపు లేదు. మనకు నచ్చినట్లు బ్రతకడమే జీవితం అని గట్టిగా నమ్ముతాడు. ఒకప్పుడు దేశం మెచ్చిన దర్శకుడిగా ఉన్న రామ్ గోపాల్ వర్మ మై లైఫ్ మై రూల్స్ అంటూ తిక్క తిక్క పనులు చేస్తుంటాడు. తాజాగా దీపావళి వేడుకలు కూడా భిన్నంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. సదరు వీడియోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.

సాధారణంగా అందరూ చేసినట్లు చేయడం నాకు నచ్చదని ఓ వీడియో పోస్ట్ చేశాడు. మరో వీడియోలో నేను కోతిని అంటూ కామెంట్ చేశాడు. భయం లేకుండా టపాసుల పేల్చుతూ వీడియోలో కనిపించాడు. దీపావళి వేళ రామ్ గోపాల్ వర్మ వెర్రి వేషాలు వైరల్ అవుతున్నాయి. ఇక నెటిజెన్స్ ఆయన దీపావళి వీడియోల మీద వరుస కామెంట్స్ చేస్తున్నారు. మరోసారి వర్మ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు.

దర్శకుడు వర్మ ప్రస్తుతం వ్యూహం టైటిల్ తో ఒక చిత్రం చేస్తున్నారు. ఇది ఏపీ సీఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్. వ్యూహం చిత్రంలో వై ఎస్ జగన్ రాజకీయ జీవితం చూపించనున్నాడు. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడిన పరిస్థితులు. వై ఎస్ జగన్ పై కేసులు, ఆపై అరెస్ట్. పాదయాత్ర చేసి ఏపీ సీఎం కావడం వంటి అంశాలు చూపించనున్నాడు.

వ్యూహం మూవీలో వర్మ నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సోనియా గాంధీ వంటి రాజకీయవేత్తలను విలన్స్ గా చూపించనున్నాడు. వ్యూహం చిత్రానికి సీక్వెల్ గా శబధం రానుంది. రెండు భాగాలుగా వై ఎస్ జగన్ బయోపిక్ తెరకెక్కుతుంది. వ్యూహం మూవీ విషయంలో కొన్ని వర్గాల నుండి వర్మ వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు. వ్యూహం 2024 ఫిబ్రవరిలో విడుదల కానుంది. వ్యూహం చిత్రంతో వర్మ రాజకీయ వివాదాలు లేపడం ఖాయం.