Ram Charan’s mother Surekha : భారీ అంచనాల నడుమ మొదలైన ఈ సీజన్ బిగ్ బాస్ షో మొన్నటి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ తో ఘనంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ విన్నర్ గా నిఖిల్ నిలవగా, రన్నర్ గా గౌతమ్ కృష్ణ నిలిచాడు. యూట్యూబ్ పోల్స్ లో మినహా, మిగిలిన అన్ని సోషల్ మీడియా మాధ్యమాలలో గౌతమ్ కృష్ణ కి అత్యధిక ఓటింగ్స్ వచ్చినప్పటికీ, ఆయన ఎలిమినేట్ అవ్వడం వెనుక అన్యాయం ఉందని ఆయన అభిమానులు సోషల్ మీడియా లో ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. గూగుల్ ద్వారా వచ్చిన ఓట్లలో అయితే గౌతమ్ కి నిఖిల్ కంటే లక్ష ఓట్లు అధికంగా వచ్చాయి. అయినప్పటికీ నిఖిల్ విన్నర్ అవ్వడంపై స్టార్ ఛానల్ కుట్ర ఉందంటూ ఆయన అభిమానులు మండిపడుతున్నారు. వాళ్ళ ఆరోపణల్లో ఎంత నిజముందో తెలియదు కానీ, బిగ్ బాస్ నుండి బయటకి వచ్చిన తర్వాత ఆయన నిన్న మొట్టమొదటిసారి మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు.
ఈ ఇంటరాక్షన్ లో తన ఓటమి గురించి మాట్లాడుతూ ‘ఒక వైల్డ్ కార్డు గా ఎంట్రీ ఇచ్చి రన్నర్ రేంజ్ కి రావడం బిగ్ బాస్ హిస్టరీ లో ఇదే తొలిసారి జరిగింది అనుకుంట. నేను విన్నర్ అవ్వలేకపోయాను అనే బాధకంటే, నన్ను నమ్మి ఓట్లు వేసిన వాళ్ళు నేను గెలవలేదని బాధపడుతున్నారు. అదే నాకు కాస్త బాధని కలిగిస్తుంది. ఎక్కడో మీ అంచనాలను నేడు అందుకోలేకపోయాను. భవిష్యత్తులో మిమ్మల్ని అలరించే విధంగా నా వంతుగా నూటికి నూరు శాతం ప్రయత్నాలు చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉండగా ఫినాలే కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వచ్చిన సంగతి తెలిసిందే. గౌతమ్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మరియు రామ్ చరణ్ కి వీరాభిమాని అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే రన్నర్ గా నిల్చి కాస్త బాధపడుతున్న సమయంలో రామ్ చరణ్ అన్నయ్య నాతో చెప్పిన మాటలను ఎప్పటికీ మర్చిపోలేను అని గౌతమ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.
ఆయన మాట్లాడుతూ ‘రామ్ చరణ్ గారి అమ్మగారు నాకు చాలా పెద్ద ఫ్యాన్ అట. నేను బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ కి వెళ్తున్నాను అమ్మా అని చరణ్ అన్న చెప్పినప్పుడు, గౌతమ్ విన్ అవుతాడు అని వాళ్ళ అమ్మగారు అన్నారట. ఎప్పుడైనా షూటింగ్ లేనప్పుడు మా అమ్మ నాకు చెప్పి మరి బిగ్ బాస్ ఎపిసోడ్స్ చూపిస్తూ ఉంటుంది. అలా నీకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకున్నావ్. బాధపడకు, జీవితం లో గొప్ప స్థాయికి వెళ్తావు అని రామ్ చరణ్ అన్నయ్య నాతో చెప్పాడు. ఇదంతా టెలికాస్ట్ లో వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ, చరణ్ అన్నయ్య చెప్పిన ఆ మాటలు విన్న తర్వాత నాలో కొత్త ఉత్సాహం వచ్చింది’ అంటూ గౌతమ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.