Allu Arvind : సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య కొంత వైరమైతే ఉందనే విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఎప్పటికప్పుడు మేమంతా ఒకటే అంటూ వాళ్ళు చెబుతున్నప్పటికి పరిస్థితులను బట్టి ఎవరి మీద ఎవరు కోపంతో ఉన్నారనే విషయాలైతే ప్రేక్షకులకు తెలిసిపోతున్నాయి. ఇక రీసెంట్ గా అల్లు అరవింద్ గేమ్ చేంజర్ సినిమా మీద ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతున్నాయి…మరి ఒకరి సినిమాల మీద మరొకరు కామెంట్స్ చేసుకోవడం ఎంత వరకు కరెక్ట్ అంటూ మెగా ఫ్యాన్స్ సైతం అల్లు అరవింద్ పైన విమర్శలను సంధిస్తున్నారు…
మెగాస్టార్ చిరంజీవి తనదైన రీతి లో సత్తా చాటుకుంటూ స్టార్ డమ్ ను సంపాదించుకోవడమే కాకుండా 50 సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే అల్లు అరవింద్ చిరంజీవితో చాలా సినిమాలు చేసి స్టార్ ప్రొడ్యూసర్ గా మారాడు. మరి ఇదిలా ఉంటే సినిమా రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజుతో అల్లు అరవింద్ గేమ్ చేంజర్ సినిమాని ఉద్దేశిస్తూ కొన్ని మాటలైతే మాట్లాడాడు. ఇక దాంతో మెగా ఫ్యాన్స్ అల్లు అరవింద్ మీద కొంతవరకు కోపాన్ని అయితే ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా మొత్తం అతన్ని ట్రోల్ చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే రీసెంట్ గా ఆయన బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అల్లుడు అయిన రామ్ చరణ్ అంటే తనకు చాలా ఇష్టమని, తన లైఫ్ మొత్తాన్ని రిస్క్ లో పెట్టి మరి మగధీర సినిమా చేశానని చెప్పాడు.
ఇక అప్పటివరకు తన దగ్గర ఉన్న డబ్బులన్నింటిని పెట్టి భారీ బడ్జెట్ తో ఆ సినిమా చేసి సూపర్ సక్సెస్ సాధించామని చెప్పాడు. ఇక రామ్ చరణ్ మొదటి సినిమా అయిన చిరుత అంత పెద్దగా సక్సెస్ సాధించకపోవడంతో తను స్టార్ హీరో రేంజ్ కి వెళ్ళిపోవాలంటే భారీ బడ్జెట్ తో తను అలా చేశాడనే చెప్పాలి.
ఇక అలాగే తన అల్లుడు అంటే తనకు చాలా ఇష్టమని రామ్ చరణ్ మీద ప్రేమను చూపించాడు. ఇక ఏది ఏమైనా కూడా మెగా అభిమానుల నుంచి ఎదురయ్యే ట్రోల్స్ ని తట్టుకోవడానికే ఆయన అలాంటి కామెంట్స్ చేశాడు అంటూ కొంతమంది కొన్ని వ్యాఖ్యలైతే చేస్తున్నారు. నిజానికి గేమ్ చేంజర్ సినిమాని ఉద్దేశిస్తూ దిల్ రాజు నువ్వు మాములోడివి కాదు. ఒక సినిమాతో డౌన్ అయితే మరో సినిమాతో హిట్టు కొట్టావ్ అంటూ ఫంక్షన్లో మాట్లాడిన మాటల్ని ఇప్పటికీ మెగా ఫ్యాన్స్ మర్చిపోలేకపోతున్నారు.
ఇక ఈ సంక్రాంతికి దిల్ రాజు గేమ్ చేంజర్ సినిమాతో ప్లాపులను మూట గట్టుకుంటే ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాతో భారీ విజయాన్ని సాధించిన విషయం మనకు తెలిసిందే. మరి ఈ సందర్భంలోనే అల్లు అరవింద్ అలాంటి కామెంట్స్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉండటం విశేషం…