Homeఎంటర్టైన్మెంట్Prabhas Expensive Dinner: ప్రభాస్ డిన్నర్ కి చేసే ఖర్చుతో ఒక మధ్య తరగతి కుటుంబం...

Prabhas Expensive Dinner: ప్రభాస్ డిన్నర్ కి చేసే ఖర్చుతో ఒక మధ్య తరగతి కుటుంబం నెల మొత్తం బ్రతికేయొచ్చు తెలుసా!

Prabhas Expensive Dinner: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ఒక గొప్ప భోజన ప్రియుడు అనేది ప్రతీ ఒక్కరికి తెలిసిన విషయమే. తినడమే కాదు, పెట్టడం లో కూడా ప్రభాస్ ఎప్పుడూ ముందు ఉంటాడు. తన ఇంటికి వచ్చిన అతిథులకు పొట్ట పగిలిపోయే రేంజ్ లో భోజనం పెట్టి పంపించడం ప్రభాస్ కి అలవాటు. ఈ అలవాటు ఆయన పెద్దనాన్న కృష్ణంరాజు నుండి వచింది. షూటింగ్ సెట్స్ లో కూడా ప్రభాస్ తన సహనటులకు వివిధ […]

Prabhas Expensive Dinner: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ఒక గొప్ప భోజన ప్రియుడు అనేది ప్రతీ ఒక్కరికి తెలిసిన విషయమే. తినడమే కాదు, పెట్టడం లో కూడా ప్రభాస్ ఎప్పుడూ ముందు ఉంటాడు. తన ఇంటికి వచ్చిన అతిథులకు పొట్ట పగిలిపోయే రేంజ్ లో భోజనం పెట్టి పంపించడం ప్రభాస్ కి అలవాటు. ఈ అలవాటు ఆయన పెద్దనాన్న కృష్ణంరాజు నుండి వచింది. షూటింగ్ సెట్స్ లో కూడా ప్రభాస్ తన సహనటులకు వివిధ రకాల వంటకాలతో పొట్ట పగిలిపోయేలా చేస్తాడు. ఆయన పంపే భోజనాన్ని పది మంది కలిసి తినొచ్చు అన్నమాట. అలా పది మంది తినే భోజనాన్ని కేవలం ఒక్కరికే పంపిస్తాడు ప్రభాస్, అది ఆయన స్పెషాలిటీ. కల్కి మూవీ ప్రొమోషన్స్ సమయం లో హీరోయిన్ దీపికా పదుకొనే గర్భం దాల్చి ఉంది. ఆమె ప్రభాస్ పెట్టే ఫుడ్ గురించి ఫన్నీ సెటైర్లు వేస్తూ, ప్రభాస్ ప్రతీ రోజు షూటింగ్ లో నాకోసం తెచ్చే ఆహరం తిని నా పొట్ట ఇలా అయిపోయింది అంటూ కామెంట్స్ చేస్తుంది.

ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ ఎంత భోజన ప్రియుడు అనేది రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. అది విన్న అభిమానులు ఆశ్చర్యపోయారు. ఆయన మాట్లాడుతూ ‘ప్రతీ ఒక్కరికి నేను తినే ఆహరం గురించి తెలుసుకోవాలని ఉంటుంది. మీకు ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాలి. నేను అప్పుడప్పుడు షూటింగ్ లొకేషన్స్ కి వేరే రాష్ట్రాల నుండి ఫుడ్ ఆర్డర్ పెడుతుంటాను. ‘ఆది పురుష్’ షూటింగ్ సమయం లో నేను ముంబై లో ఉన్నాను. అప్పుడు చెన్నై నుండి ఫుడ్ ఆర్డర్ పెట్టా. మా టీం అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఫ్లైట్ లో ఫుడ్ తెచ్చిన అతను నా వద్దకు వచ్చి ‘మీరు సామాన్యులు కాదండి బాబోయ్’ అని అన్నాడు’ అంటూ చెప్పుకొచ్చాడు ప్రభాస్.

ఒక్కోసారి ప్రభాస్ కి డిన్నర్ సమయం లో ఫుడ్ కోసం 30 వేల నుండి లక్ష రూపాయిల వరకు ఖర్చు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయట. అంటే ఒక సామాన్య మధ్య తరగతి కి చెందిన కుటుంబ సభ్యుడు నెల మొత్తం కస్టపడి సంపాదించే డబ్బుని, ప్రభాస్ కేవలం డిన్నర్ కోసం ఖర్చు చేస్తాడు అన్నమాట. ఇంత రాయల్ గా బ్రతికే హీరో ఇండియా లో బహుశా ఎక్కడ ఉండదు ఏమో అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం ‘ఫౌజీ’ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చెయ్యాలని అనుకుంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper