Sanktanthiki vastunnam : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు అంటే భారీ సక్సెస్ లను అందుకోలేరనే ఒక అపోహలో అయితే చాలా మంది ఉండేవారు. కానీ వెంకటేష్ లాంటి స్టార్ హీరో ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sanktanthiki vastunnam) సినిమాతో పెను ప్రభంజనాలను సృష్టిస్తూ ముందుకు సాగుతూ ఉండటం చూసిన ప్రతి ఒక్కరు ముక్కున వేలు వేసుకుంటున్నారు…ఇక విమర్శించిన వాళ్లతోనే ప్రశంసలను అందుకుంటున్న వెంకటేష్ ప్రస్తుతం సీనియర్ హీరోలందరిలో టాప్ పొజిషన్ లో ఉన్నాడనే చెప్పాలి…
వెంకటేష్ (Venkatesh) హీరోగా అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో దిల్ రాజు(Dil Raju) ప్రొడ్యూసర్ గా వచ్చిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vastunnam)ఈ సంక్రాంతి సీజన్ కి వచ్చిన ఈ సినిమా భారీ రికార్డులను కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్తుంది. కేవలం 70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు 305 కోట్ల కలెక్షన్లు రాబట్టింది మామూలు విషయం కాదు. అయితే నైజాంలో ఈ సినిమాకి భారీగా లాభాలైతే వచ్చాయి అంటూ నైజాం డిస్ట్రిబ్యూటర్లు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ వచ్చిన ఈ సినిమా భారీ ప్రభంజనాలను సృష్టించడం అనేది మామూలు విషయమైతే కాదు…ఇక ఇదిలా ఉంటే తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్న అనిల్ రావిపూడి కామెడీ సినిమాలను చేస్తూ వరుస సక్సెస్ లను సాధిస్తూ వస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన వరుసగా ఎనిమిది విజయాలను సాధించాడు.
నిజానికి ఆయన చేసిన సినిమాలన్నీ సక్సెస్ అయ్యాయి అంతే మామూలు విషయం కాదు. అయితే నైజాంలో 8.50 కోట్ల బిజినెస్ ని జరుపుకున్న ఈ సినిమా ఇప్పటివరకు 46.50 వసూళ్లను అయితే రాబట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి… ఇక 46.50 నుంచి 8.50 తీసివేస్తే 38.50 కోట్ల ప్రాఫిట్స్ అయితే వచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు కొత్త పంతులు తొక్కుతూ ముందుకు సాగుతూ ఉండటం అనేది ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది.
కమర్షియల్ సినిమాల్లో సైతం భారీ విజయాలను సాధిస్తుండడంతో సీనియర్ హీరోలందరు కమర్షియల్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండటం విశేషం…కథ బాగుంటే సినిమా ఎప్పుడైనా ఆడుతుందని చెప్పడానికి అనిల్ రావిపూడి సినిమాలను మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు.
ఇప్పటికే ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధిస్తూ వస్తున్నాయి. దాదాపు 8 సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్న ఆయన ఇప్పటి వరకు ఫెయిల్యూర్స్ లేని డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక రాజమౌళి 12 సినిమాలతో వరుస విజయాలను సాధిస్తే అనిల్ రావిపూడి 8 సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించి రాజమౌళి బాటలోనే నడుస్తున్నాడు… చూడాలి మరి ఇకమీదట వచ్చే సినిమాలతో అనిల్ రావిపూడి ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు తద్వారా ఏ రేంజ్ డైరెక్టర్ గా కొనసాగుతాడు అనేది…