https://oktelugu.com/

Pushpa 2 Collection: ఇంత నెగిటివిటీ లో కూడా ఈ రేంజ్ వసూళ్లా..? 17వ రోజు ‘పుష్ప 2’ వసూళ్లు ఎంతో తెలుసా..? ఇది ఎవ్వరూ ఊహించనిది!

ఇప్పటి వరకు ఈ చిత్రం విడుదలై నిన్నటి 17 రోజులు పూర్తి అయ్యింది. నేడు ఈ చిత్రం నాల్గవ వారం లోకి అడుగుపెడుతుంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 17 వ రోజు రెండు కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

Written By:
  • Vicky
  • , Updated On : December 22, 2024 / 04:06 PM IST

    Pushpa 2 Collection(2)

    Follow us on

    Pushpa 2 Collection: ఈ నెల మొత్తం మన ఇండియన్ ఆడియన్స్ కి ఎక్కడ చూసినా అల్లు అర్జున్ మాత్రమే కనిపిస్తున్నాడు. ‘పుష్ప 2’ చిత్రం తో ఆయన సృష్టించిన ప్రభంజనం ఒక ఎత్తు అయితే, సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసిలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆ ఘటనపై కారణం అల్లు అర్జున్ నిర్లక్ష్యమే అని పోలీసులు తప్పుబట్టి అతన్ని అరెస్ట్ చేయడం వంటి సంఘటనలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ని ఉలిక్కిపడేలా చేసింది. అల్లు అర్జున్ మీద పబ్లిక్ లో విపరీతమైన నెగిటివిటీ పెరిగిపోయింది. ఈ నెగిటివిటీ తాలూకు ప్రభావం సినిమా మీద పడి వసూళ్లు తగ్గుతాయేమో అని కొంతమంది అభిమానులు భయపడ్డారు. కానీ నెగిటివిటీ పెరిగేకొద్దీ ఈ చిత్రానికి వసూళ్లు పెరగడాన్ని చూస్తుంటే, జనాలు సినిమాని సినిమా లాగానే చూస్తారు, బయట జరిగే సంఘటనలు వాళ్ళని ప్రభావితం చెయ్యవు అనేది స్పష్టంగా ‘పుష్ప 2 ‘ విషయం లో మరోసారి రుజువు అయ్యింది.

    ఇప్పటి వరకు ఈ చిత్రం విడుదలై నిన్నటి 17 రోజులు పూర్తి అయ్యింది. నేడు ఈ చిత్రం నాల్గవ వారం లోకి అడుగుపెడుతుంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 17 వ రోజు రెండు కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా వరల్డ్ వైడ్ గా హిందీ వెర్షన్ తో కలిపి చూసుకుంటే 17 వ రోజు ఈ చిత్రానికి 34 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. దీంతో ఈ చిత్రం 17 రోజులకు 1570 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ప్రాంతాల వారీగా ఒకసారి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో 304 కోట్ల రూపాయిల గ్రాస్, 204 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, నార్త్ ఇండియా లో 800 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

    అదే విధంగా కర్ణాటక 130 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, తమిళనాడులో 75 కోట్ల రూపాయిలు, కేరళలో 18 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక మన టాలీవుడ్ కి అతి పెద్ద మార్కెట్ గా పిలవబడే ఓవర్సీస్ నుండి ఈ చిత్రానికి 250 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు అక్కడి ట్రేడ్ పండితులు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమా 17 రోజులకు గాను 1577 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ఈ క్రిస్మస్ తో ఈ చిత్రం కచ్చితంగా 2000 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లకు అతి చేరువలో ఈ చిత్రం చేరబోతుందని, ఇండియా లోనే ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ చిత్రం గా నిలుస్తుందని ట్రేడ్ పండితులు బలమైన నమ్మకం తో చెప్తున్నారు. మరి ఆ రేంజ్ కి చేరుతుందా లేదా అనేది చూడాలి.