Ram Charan , Buchibabu
Ram Charan and Buchibabu : తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి మెగాస్టార్ చిరంజీవి గుర్తుకొస్తాడు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు ఇండస్ట్రీలో భారీ సక్సెస్ ను సాధించడమే కాకుండా ఒక సపరేట్ ఇమేజ్ ని కూడా తీసుకొచ్చి పెట్టాయి. దాదాపు 50 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో పొజిషన్ ని కాపాడుకుంటూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఈ ఏజ్ లో కూడా వరుస సినిమాలను చేస్తూ సూపర్ డూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాడు…
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ చిరుత (Chirutha) సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్నాడు.ఇక ఎప్పుడైతే ఆయన మగధీర (Magadheera) సినిమా చేశాడు. ఇక అప్పటినుంచి స్టార్ హీరో లిస్టులో చేరిపోయాడు. రెండోవ సినిమాతోనే ఇండస్ట్రీ రికార్డును క్రియేట్ చేసిన ఆయన తనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకోవడంలో అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతూ ఉండటం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న రామ్ చరణ్ రీసెంట్ గా చేసిన ‘గేమ్ చేంజర్’ సినిమాతో భారీ డిజాస్టర్ ని మూట గట్టుకున్నాడు. ఇక ఇప్పుడు బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ సాధించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…
ఇక బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో నటించడానికి దాదాపు పది కిలోల బరువు తగ్గినట్టుగా తెలుస్తోంది. ఆ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందట అయితే ఇందులో కూడా రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటించబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఆ క్యారెక్టర్ లో నటించడానికి రామ్ చరణ్ 10 కిలోల వెయిట్ తగ్గాల్సిన అవసరం అయితే వస్తుందట.
ఇక దానికోసమే రామ్ చరణ్ డైట్ చేస్తున్నాడు. ముందుగా ఈ పోర్షన్ మొత్తం తీసిన తర్వాత పది కిలో వెయిట్ తగ్గి ఆ క్యారెక్టర్ ను చేసి ఆ తర్వాత మళ్ళీ బాడి ని రికవరీ చేసుకోవాలని ఉద్దేశ్యం లో రామ్ చరణ్ ఉన్నాడట. రామ్ చరణ్ చాలా డేడికేటెడ్ గా వర్క్ చేస్తున్నాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అయినప్పటికి అందులో అప్పన్న క్యారెక్టర్ ను రామ్ చరణ్ చాలా అద్భుతంగా పోషించాడు.
నత్తి తో బాధపడుతున్న వ్యక్తి ఎలా అయితే మాట్లాడతాడు ఎలా తనను తాను ఓవర్ కమ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. అలాగే ఆ క్యారెక్టర్ లో ఉన్న వెరిషన్స్ ను చూపిస్తూ చాలా దృఢ సంకల్పంతో ముందుకు సాగుతూ ఆ పాత్రలో రామ్ చరణ్ అద్భుతంగా నటించి మెప్పించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…ఇక ఈ సినిమా తర్వాత ఆయన సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు…