https://oktelugu.com/

Sai Pallavi : ‘తండేల్’ సక్సెస్ టూర్ కి సాయి పల్లవి దూరంగా ఉండడానికి కారణం అదేనా..? ఆరోజు జరిగిన గొడవనే కారణమా!

వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకున్న నాగ చైతన్య కి 'తండేల్' చిత్రం రూపం లో మంచి బ్లాక్ బస్టర్ హిట్ దొరికిన సంగతి తెలిసిందే. టాక్ బయట యావరేజ్ రేంజ్ లోనే ఉన్నప్పటికీ, దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం, నాగ చైతన్య అద్భుతమైన పెర్ఫార్మన్స్ కారణంగా ఈ సినిమాకి జనాలు క్యూలు కడుతున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : February 10, 2025 / 02:12 PM IST
    Sai Pallavi

    Sai Pallavi

    Follow us on

    Sai Pallavi : వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకున్న నాగ చైతన్య కి ‘తండేల్’ చిత్రం రూపం లో మంచి బ్లాక్ బస్టర్ హిట్ దొరికిన సంగతి తెలిసిందే. టాక్ బయట యావరేజ్ రేంజ్ లోనే ఉన్నప్పటికీ, దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం, నాగ చైతన్య అద్భుతమైన పెర్ఫార్మన్స్ కారణంగా ఈ సినిమాకి జనాలు క్యూలు కడుతున్నారు. మొదటి మూడు రోజుల్లో ఈ చిత్రానికి దాదాపుగా 60 కోట్ల రూపాయిల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. నాగ చైతన్య కెరీర్ లో ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పొచ్చు. బుక్ మై షో లో ఈ చిత్రానికి మూడు రోజులకు కలిపి 8 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇప్పటి వరకు స్టార్ హీరోలకు తప్ప, ఈ రేంజ్ టికెట్ సేల్స్ మీడియం రేంజ్ హీరో సినిమాకు జరగలేదు. పాటలు జనాల్లోకి వెళ్తే ఏ రేంజ్ ఓపెనింగ్స్ వస్తాయి అనడానికి ఈ సినిమా మరో నిదర్శనంగా మారింది.

    అయితే మూవీ టీం సక్సెస్ టూర్ ని రెండవ రోజు నుండే మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. నిన్న విజయవాడ లోని శైలజ థియేటర్ లో మూవీ టీం మొత్తం పాల్గొని సందడి చేసింది. కానీ హీరోయిన్ సాయి పల్లవి మాత్రం అందుబాటులో లేకపోవడం అభిమానులను కాస్త నిరాశకు గురి చేసింది. ఇలాంటి సందర్భాల్లో అనేక రకాలుగా నెటిజెన్స్ సోషల్ మీడియా లో అనుకుంటూ ఉంటారు. సాయి పల్లవికి, మూవీ టీం కి మధ్య ఎదో గొడవ జరిగిందని, కేవలం సినిమాకి, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మాత్రమే అగ్రిమెంట్ చేసుకున్నారని, ఆ తర్వాత జరిగే ఈవెంట్స్ కి తనకు ఎలాంటి సంబంధం లేదని సాయి పల్లవి తేల్చి చెప్పడంతో కాస్త విబేధాలు ఏర్పడ్డాయని,అందుకే ఆమె రావట్లేదని సోషల్ మీడియా లో ప్రచారం జరిగింది. అయితే అందులో ఎలాంటి నిజం లేదని తర్వాత తెలిసింది.

    సాయి పల్లవి కి గత వారం రోజులుగా ఆరోగ్యం సరిగా లేదని, డాక్టర్లు ఇచ్చిన సలహా మేరకు ఆమె ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ ఉందని, అందుకే ఆమె సక్సెస్ టూర్ లో పాల్గొనలేదంటూ ‘తండేల్’ మూవీ టీం చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న రూమర్స్ కి చెక్ పడింది. ఇది ఇలా ఉండగా త్వరలోనే ఒక విజయోత్సవ సభని ఏర్పాటు చేయబోతున్నారని, ఈ ఈవెంట్ కి అక్కినేని నాగార్జున ముఖ్య అతిథి గా పాల్గొనబోతున్నాడని, ఈ ఈవెంట్ కి సాయి పల్లవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గత ఏడాది సాయి పల్లవి నటించిన ‘అమరన్’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇంత పెద్ద భారీ బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ ఆమె ఈ రేంజ్ లో హిట్ కొట్టడం ఆమె కెరీర్ కి మంచి బూస్ట్ దక్కినట్టు అయ్యిందంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.