Upasana: ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా అల్లర్లు,హత్యలు, మానభంగాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక 78 సంవత్సరాల స్వాతంత్ర్య భారతదేశంలో ఇప్పటికీ కూడా స్త్రీలకు సరైన రక్షణ లేదనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక రీసెంట్ గా కలకత్తాలోని ఆర్ జి ఆర్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ మీద అత్యాచారం జరగడం తో పాటు ఆమె హత్య కు గురైన సంఘటనలు ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టుకునేలా చేస్తున్నాయి. నిజానికి ఈ నెల 9వ తేదీన కాలేజి లో సెమినార్ హాలు లో ఒంటి మీద గుడ్డలు కూడా లేకుండా జూనియర్ డాక్టర్ మృతదేహం కనిపించడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం సమాజం ఎటు పోతుంది అనే విధంగా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరమైతే ఉంది. ఇక దీంతో ఆ మృతురాల పట్ల నిరసనకు దిగిన విద్యార్థులు కాలేజీ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇక పోస్టుమార్టం రిపోర్టు కనక చూసినట్టయితే ఆమె హత్యకు గురవడానికి ముందు గ్యాంగ్ రేప్ కి గురైనట్టుగా కూడా తెలుస్తుంది. ఆమెను అత్యాచారం చేసేటప్పుడు ఆమెను కొట్టిన విధానానికి ఆమె పెట్టుకున్న కళ్లద్దాలు కూడా ఆమె కళ్ళల్లో గుచ్చుకున్నాయి అంత దారుణంగా చిత్రహింసలు పెట్టి ఆమెను చంపిన సంఘటన ఇప్పుడు యావత్ భారతదేశం మొత్తాన్ని కుదిపేస్తుంది…
ఇక పశ్చిమ బెంగాల్ సీఎం అయినా మమతా బెనర్జీ మాత్రం ఈ సంఘటన పైన ఎలాంటి స్పందను తెలియజేయడం లేదంటూ ప్రతిపక్ష పార్టీ అయిన బిజెపి పార్టీ అధికార పార్టీని విమర్శిస్తుంది. ఇక దోషులు ఎవరో ప్రభుత్వానికి తెలుసని వాళ్ళు ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండటం వల్ల వాళ్ళని తప్పించి మిగతా వారిని దోషులుగా సృష్టించే ప్రయత్నం కూడా జరుగుతుందని భారీ విమర్శలైతే చేస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే ఈ సంఘటన పైన రామ్ చరణ్ భార్య అయిన ఉపాసన కూడా స్పందిస్తూ ఇలాంటి అనాగరిక సమాజంలో మనం 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.. నిజానికి ఇక్కడ ఆడవాళ్ళకి గౌరవం, రక్షణ, భద్రత అనేవి లేకుండా పోతున్నాయి. ఆడవాళ్ళనే వెన్నుముకలుగా పిలుచుకుంటూ ఉంటాం అలాంటి వాళ్ళని ఇప్పుడు ఎదగనివ్వకుండా చేస్తున్న కొంతమంది వికృతి చేష్టలకు చెక్ పెట్టాల్సిన సమయం అయితే ఆసన్నమైంది అంటూ ఉపాసన పేర్కొంది…
ఇక ఇదిలా ఉంటే ఇండియాలో ఉన్న స్వేచ్చ ప్రపంచం లో మరెక్కడా లేదు అందుకే మన దగ్గర చాలా సింపుల్ గా తప్పులు చేస్తున్నారు. అలాగే తప్పు చేసిన వాడు ఈజీగా తప్పించుకోవచ్చనే భరోసా తో ఉండటం వల్లే ఇక్కడ క్రైమ్ రేటు రోజురోజుకు పెరిగిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా లా అండ్ ఆర్డర్ లను కంట్రోల్ చేసేవారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ల పని వాళ్ళు చేసుకుంటూ దోషులను శిక్షిస్తే మరోసారి ఇలాంటివి జరగకుండా ఉంటాయని మరి కొంతమంది సంఘ సంస్కర్తలు కూడా వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…