Homeఎంటర్టైన్మెంట్Upasana: దత్తత తీసుకున్న రాంచరణ్ భార్య ఉపాసన .. అంతా షాక్

Upasana: దత్తత తీసుకున్న రాంచరణ్ భార్య ఉపాసన .. అంతా షాక్

Upasana: ఉపాసన కొణిదెల పరిచయం అక్కర్లేని పేరు గా చెప్పవచ్చు. అపొలో అధినేత మనవరాలిగా, మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ భార్యగా, మెగా కోడలుగా ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. బిజినెస్ రంగంలో ఎంతోమంది యువతకు ఆదర్శంగా అగ్ర స్థాయిలో దూసుకుపోతున్నారు ఈ బిజినెస్ ఉమెన్ . ఉపాసన కొణిదెల ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఫ్యామిలీ వీడియోస్ ,సెలబ్రిటీస్ ఫన్ వీడియోస్,ఫిట్‌నెస్‌, ఆయుర్వేదం, జంతువుల సంరక్షణ వంటి విషయాలపై అవగాహన కల్పిస్తూ అలానే ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తుంటారు. అయితే మరోసారి తన మహోన్నతమైన మనసును చాటుకున్నారు ఉపాసన తాజాగా రెండు సింహాలు దత్తత తీసుకున్నారు.

ram charan wife upasana adobt two lions from nehru zoological national park
Upasana

Also Read: Akhanda Movie: అమెరికాలో బాలకృష్ణ ఫ్యాన్స్ ఏం చేశారంటే…

హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌లోని విక్కీ, లక్ష్మీ అనే రెండు సింహాలను దత్తత తీసుకున్నారు ఉపాసన వాటి సంరంక్షణ బాధ్యతలు, ఆహారపు ఖర్చులను ఏడాదిపాటు చూసుకోనున్నారు. దీనికోసం 2 లక్షల చెక్కును నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌ క్యూరేటర్‌ ఎస్‌. రాజశేఖర్‌కు అందించారు. జూలో ఉంచిన 2000 మెగా జంతువులు జంతువులను కాపాడుతున్నారని వాటి పరిశుభ్రతగా ఉంచడంలో సిబ్బంది అంకితభావంపై ఉపాసన ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ఉపాసనకు నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌ క్యూరేటర్‌ ఎస్‌ రాజసేఖర్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. ఉపాసన గారిది మంచి మనసు వన్యప్రాణుల పరిరక్షణపై వారు చూపించిన నిబద్ధత ఎంతో మందికి స్ఫూర‍్తిదాయకమన్నారు. కరోనా కష్టకాలంలో చాలామంది సెలబ్రిటీస్ వన్యప్రాణుల పరిరక్షణపై అంకితభావం చూపించారని అలానే వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చారన్నారు. సాధారణ వ్యక్తులు కూడా వాటిని దత్తత తీసుకోవాలని అన్నారు.

Also Read: Samantha: జీవితంలో అదే అతి పెద్ద గుణపాఠం అంటున్న సమంత…

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular