Kangana Ranaut: ఎప్పుడు సోషల్ మీడియాలో తన పోస్టులతో ఇంకొకర్ని విమర్శిస్తూ నిత్యం నెటిజన్స్ నోట్లో వినిపించే పేరు బాలీవుడ్ విమర్శల బ్యూటీ కంగనా రనౌత్. సినిమా, రాజకీయ అంశాలపై తరచూ స్పందిస్తుంటారు ఈ భామ.రాజకీయ పార్టీ లో ఎక్కువగా బీజేపీ పార్టీకి మద్దతుగా మాట్లాడుతారు కంగనా.అయితే త్వరలోనే బీజేపీలో చేరుతుందని పుకార్లు కూడా ఆ మధ్య కాలంలో వినిపించాయి.కానీ కంగనా మాత్రం ఆ పుకార్లను కొట్టిపారేసింది తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని చేప్పే కానే చేపింది విమర్శల బ్యూటీ .

Also Read: Akhanda Movie: అమెరికాలో బాలకృష్ణ ఫ్యాన్స్ ఏం చేశారంటే…
అయితే కంగనా ఈ శనివారం ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఉన్న శ్రీకృష్ణ జన్మస్థలాన్ని సందర్శించించారు. ఆ తర్వాత మీడియాతో ముచ్చటించారు ఈ భామ ఇందులో భాగంగా విలేకరులు .. ఉత్తరప్రదేశ్‌లో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేస్తారా అని ప్రశ్నించగా.. తాను ఏ పార్టీకి మద్దతు ఇవ్వనని కానీ జాతీయవాదుల తరపున ప్రచారం చేస్తానని చెప్పుకొచ్చారు కంగనా. అలాగే శ్రీకృష్ణ జన్మస్థలం పక్కన ఈద్గా ఉందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చర్యలు చేపట్టి అసలైన పుణ్యస్థలాన్ని ప్రజలకు చూపిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. అయితే తన ప్రకటన వల్ల కొంతమంది మనోభావాలను దెబ్బతింటాయని, కానీ నిజాయితీపరులు, ధైర్యవంతులు, మాత్రం తాను.చెప్పింది సరైనది అని భావిస్తారని చెప్పుకొచ్చారు ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే పంజాబ్‌లోని బటిందాకు చెందిన ఒక వ్యక్తి తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆ వ్యక్తిపై కేసు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
Also Read: Pushpa Allu Arjun: ‘పుష్ప’ షూట్ లో యూనిట్ కు సంచలన ఆదేశాలు ఇచ్చిన అల్లు అర్జున్.. వీడియో వైరల్