Ram Charan: మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ నేడు చిరంజీవి నే మించిన స్టార్ గా ఎదిగిన సంగతి మన అందరికీ తెలిసిందే. కెరీర్ ప్రారంభం లోనే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ తో చెడుగుడు ఆదుకున్న రామ్ చరణ్, ఇప్పుడు పాన్ వరల్డ్ స్టార్ గా, గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. #RRR తర్వాత రామ్ చరణ్ సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ తో ‘గేమ్ చేంజర్’ అనే చిత్రం చేసిన సంగతి తెలిసిందే. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ కానుకగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన మొదటి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది, రెండవ పాట ఈ నెలలోనే విడుదల కాబోతున్నట్టు రీసెంట్ గానే ఒక పోస్టర్ ద్వారా తెలియచేసింది మూవీ టీం.
ఇదంతా పక్కన పెడితే రామ్ చరణ్ గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అదేమిటంటే రామ్ చరణ్ – కాజల్ అగర్వాల్ జంట ఇండస్ట్రీ లోనే టాప్ మోస్ట్ కాంబినేషన్స్ లో ఒకటి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వీళ్లిద్దరు కలిసి ‘మగధీర’, ‘నాయక్’, ‘గోవిందుడు అందరి వాడేలే’, ‘ఎవడు’ వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించారు. అప్పట్లో వీళ్లిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ని చూసి కచ్చితంగా వీళ్ళ మధ్య ఎదో జరుగుతుంది అని అనుకునేవారు చాలా మంది. ఇది చాలా కామన్, ఒకే కాంబినేషన్ రెండు మూడు సార్లు రిపీట్ అయినప్పుడు ఇలాంటి రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. అయితే రామ్ చరణ్, కాజల్ వ్యక్తిగతంగా మంచి స్నేహితులు. వీళ్లిద్దరి మధ్య ఒకరిని ఒకరు ఆటపట్టించుకునేంత చనువు ఉంది.
వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ‘మగధీర’ చిత్రం ఎలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే. అప్పటి వరకు ఉన్నటువంటి రికార్డ్స్ ని డబుల్ మార్జిన్ తో అధిగమించింది ఈ చిత్రం. ఈ సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ , కాజల్ చాలా క్లోజ్ అయ్యాడు.రామ్ చరణ్ అయితే కాజల్ ని షూటింగ్ సమయంలో చాలా ఆటపట్టించేవాడట. తన గుర్రానికి కూడా కాజల్ అని పేరు పెట్టి, ఆమెని సరదాగా వెక్కిరించేవాడట. కాజల్ కూడా రామ్ చరణ్ ని అనేక సందర్భాలలో ఆటపట్టించేది అట. కానీ డామినేషన్ ఎక్కువగా రామ్ చరణ్ దే ఉండేదట. కాజల్ ఒక్కోసారి రామ్ చరణ్ జోక్స్ కి తిరిగి కౌంటర్లు వేయలేక అలా చూస్తూ ఉండిపోయేదట.షూటింగ్ సమయంలో నాకు టార్చర్ చూపించేవాడు అంటూ అప్పట్లో ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్, దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతోంది. వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ఆఖరి చిత్రం ఎవడు, మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో సినిమా రాలేదు.