Ram Charan: మన ఇండియా లో అత్యంత ప్రజాధారణ పొందిన కొంతమంది ప్రముఖ సెలబ్రిటీలకు సంబంధించిన మైనపు బొమ్మలను లండన్ లోని మేడం తుస్సాడ్స్ మ్యూజియం లో ప్రతిష్టించడం గొప్ప గౌరవంగా భావిస్తూ ఉంటారు మన ఇండియన్స్. ముందుగా ప్రభాస్ కి ఈ అదృష్టం దక్కింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు, ఆ తర్వాత అల్లు అర్జున్ కి ఆ అరుదైన అవకాశం దక్కింది. ఇప్పుడు రామ్ చరణ్(Global Star Ram charan) కి ఆ అవకాశం దక్కింది. కొద్ది నెలలు క్రితమే ఆయన మైనపు విగ్రహం కోసం రామ్ చరణ్ ఇంటికి వచ్చి, ఆయన కొలతలు తీసుకొని వెళ్లారు మ్యూజియం స్టాఫ్. స్టైల్ లో సోఫాలో కూర్చొని, ఆయన చేతిలో రైమ్ అనే పెంపుడు కుక్కని కూడా పెట్టుకున్నాడు. రైమ్ ని నాతో పాటు చేరిస్తేనే కొలతలు ఇస్తానని రామ్ చరణ్ మ్యూజియం అధికారులకు ఒక షరతు పెట్టాడట.
ఆ షరతు ని అంగీకరించిన తర్వాతనే అనుమతిని ఇచ్చాడట. మొన్ననే ఈ కార్యక్రమం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూసారు. క్లారిటీ లేని కొన్ని ఫోటోలు మాత్రమే బయటకు వచ్చాయి కానీ, పూర్తి స్థాయి స్పష్టత ఉండే ఫోటోలు నిన్నటి వరకు రాలేదు. కాసేపటి క్రితమే ఒక ఫోటో వచ్చింది. రామ్ చరణ్ మైనపు విగ్రహం పక్కన ఒక పక్క ఆయన తల్లి సురేఖ కూర్చోగా, మరోపక్క రామ్ చరణ్ తన రైమ్ కుక్కతో కలిసి కూర్చుంటాడు. ఇక వెనుక మెగాస్టార్ చిరంజీవి, ఉపాసన కొణిదెల నిల్చొని ఉంటారు. మెగా అభిమానులకు చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు అనే విధంగా ఉన్నటువంటి ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది. మెగా అభిమానులు ఈ ఫోటోని షేర్ చేస్తూ ‘మూమెంట్ ఆఫ్ ది డే’ అని అంటున్నారు.
ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు తో ‘పెద్ది’ అనే చిత్రం చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. షూటింగ్ కార్యక్రమాలు జెట్ స్పీడ్ లో జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ, వచ్చే ఏడాది మార్చి 27 న విడుదల చేసేందుకే ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియో కి ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. IPL సీజన్ మొత్తం పెద్ది సిగ్నేచర్ షాట్ తో ఊగిపోయింది. ‘గేమ్ చేంజర్’ ఫ్లాప్ తో నిరాశ లో ఉన్న మెగా ఫ్యాన్స్, పెద్ది తో భారీ కం బ్యాక్ ఇస్తామనే బలమైన నమ్మకం కలిగింది. చూడాలి మరి ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది. ఈ చిత్రం లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.