Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేడు హైదరాబాద్ లోని ఒక RTO ఆఫీస్ లో సందడి చేసాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ముఖ్యంగా రామ్ చరణ్ లేటెస్ట్ లుక్స్ ని చూసి అభిమానులు సంబరపడుతున్నారు. రీసెంట్ గానే రామ్ చరణ్ రోల్స్ రాయిస్ కారు లేటెస్ట్ మోడల్ ని కొనుగోలు చేసారు. ఈ కారు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసమే ఆయన ఖైతారాబాద్ RTO ఆఫీస్ కి విచ్చేశాడు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే అధికారులు మొత్తం రామ్ చరణ్ తో ప్రత్యేకంగా ఫోటోలు దిగారు. ఈ కారు విలువ సుమారుగా 10 నుండి 12 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా. ఇది ఇలా ఉండగా రోల్స్ రాయిస్ కారు ప్రతీ సెలబ్రిటీ కొనుగోలు చేయలేడు. ఎన్ని వందల కోట్లు సంపాదించే వాడు అయినప్పటికీ కూడా ఈ కారుని కొనుగోలు చేయలేరు.
ఈ కారుని కొనాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. ఆ అర్హతలకు తగినవాడు అయితేనే రోల్స్ రాయిస్ సంస్థ తమ ప్రోడక్ట్ ని అమ్మడానికి ఇష్టపడుతుంది. దశాబ్దాల నుండి ఈ స్టాండర్డ్స్ ని మైంటైన్ చేస్తుంది కాబట్టే రోల్స్ రాయిస్ కి అంత మంచి బ్రాండ్ ఇమేజి ఉంది. ఇండస్ట్రీ లో కేవలం ఇద్దరు ముగ్గురుకి మాత్రమే ఈ కారు ఉంది. ఇప్పుడు లేటెస్ట్ గా రామ్ చరణ్ కూడా ఆ లిస్ట్ లోకి చేరిపోయాడు. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే శంకర్ తో కలిసి ఆయన చేసిన ‘గేమ్ చేంజర్’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10వ తారీఖున విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రెండు పాటలు విడుదలై అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఈ దీపావళికి ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని కూడా విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇది ఇలా ఉండగా వచ్చే నెల నుండి రామ్ చరణ్ , బుచ్చి బాబు తెరకెక్కించబోయే సినిమాకి షిఫ్ట్ అవ్వబోతున్నాడు. ఆ సినిమా కోసం ఆయన సరికొత్త లుక్ ని కూడా సిద్ధం చేసాడు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరో పక్క రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ మూవీ ప్రొమోషన్స్ కోసం షెడ్యూల్ ని సిద్ధం చేసుకున్నాడు. నెల రోజులు మొత్తం ఆయన పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషల్లోనూ ఈ సినిమాని ప్రమోట్ చేయబోతున్నాడు. అలాగే తెలుగు తో పాటు తమిళం లో కూడా భారీ లెవెల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ని ఏర్పాటు చేయబోతున్నారు మేకర్స్. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకి రానున్నాయి.