Ram Charan Forbes Magazine: రామ్ చరణ్ దంపతులు అరుదైన గౌరవం అందుకున్నారు. వరల్డ్ టాప్ మ్యాగజైన్స్ లో ఒకటైన ఫోర్బ్స్ కవర్ పేజ్ పై దర్శనం ఇచ్చారు. ఈ సెలబ్రిటీ కపుల్ స్టైలిష్ లుక్ వైరల్ అవుతుంది. ఆర్ ఆర్ ఆర్ మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆయనకు పలు అంతర్జాతీయ గౌరవాలు దక్కాయి. ఆస్కార్ కి ముందు కొన్ని రోజుల పాటు రామ్ చరణ్ యూఎస్ లో పర్యటించారు. అమెరికన్ మీడియా ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు.
ఆర్ ఆర్ ఆర్ మూవీలోని నాటు నాటు ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకుంది. మరోవైపు రామ్ చరణ్ వైఫ్ ఉపాసన బిజినెస్ లో రాణిస్తుంది. ఉమెన్ ఎంట్రప్రెన్యూర్ గా ఉపాసన అవార్డులు అందుకున్నారు. అపోలో వేల కోట్ల బిజినెస్ వ్యవహారాల్లో ఆమె కీలకంగా ఉన్నారు. ఈ క్రమంలో ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇండియా… రామ్ చరణ్, ఉపాసన దంపతుల ఫోటోను కవర్ పేజ్ పై ముద్రించింది.
ఈ గౌరవం అందుకున్న టాలీవుడ్ కపుల్ గా రామ్ చరణ్, ఉపాసన రికార్డులకు ఎక్కారు. రామ్ చరణ్, ఉపాసన స్టైలిష్ లుక్ కట్టిపడేస్తుంది. ప్రస్తుతం రామ్ చరణ్ దంపతులు ముంబైలో పర్యటిస్తున్నారు. అక్కడ పలు దేవాలయాలను సందర్శించారు. కాగా మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేని రామ్ చరణ్ దంపతులు కలిశారు. ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలుస్తుంది. రామ్ చరణ్ దంపతులను సత్కరించిన సీఎం, వినాయకుడు విగ్రహం బహుమతిగా ఇచ్చారు.
ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారు. భారతీయుడు 2 షూటింగ్ తిరిగి ప్రారంభం కావడంతో గేమ్ ఛేంజర్ ఆలస్యం అవుతుంది. 80 శాతం షూటింగ్ పూర్తి చేసినట్లు ఇటీవల దిల్ రాజు చెప్పారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అంజలి, శ్రీకాంత్, సునీల్ కీలక రోల్స్ చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.