Sukumar Ram Charan upcoming film: మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న నటుడు రామ్ చరణ్…ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని ఉన్నతమైన స్థానంలో నిలిపాయి. ఇకమీదట చేయబోతున్న సినిమాలతో అతను చాలెంజింగ్ రోల్స్ ని చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్లో ‘పెద్ది’ సినిమాని చేస్తున్న ఆయన ఆ తర్వాత చేయబోయే సినిమా విషయంలో కూడా పలు జాగ్రత్తలైతే తీసుకుంటున్నాడు. సుకుమార్ తో చేస్తున్న సినిమా విషయంలో ఆయన ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా క్లారిటీగా ఉండే విధంగా చూసుకుంటున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు రంగస్థలం సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా రామ్ చరణ్ లోని ఒక వినూత్నమైన నటుడు సైతం బయటికి తీసింది…
అలాంటి ధోరణిలోనే వీళ్లిద్దరు మరో కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక రంగస్థలం సినిమాలో చెవిటి చిట్టిబాబు పాత్రలో నటించిన రామ్ చరణ్ ఇప్పుడు చేయబోతున్న సినిమాలో ముసలి వ్యక్తి పాత్రలో నటిస్తున్నాడు. ఆ క్యారెక్టర్ లో ఒక ఇంటెన్స్ ఉంటుందని రామ్ చరణ్ ఆ పాత్రను చాలా ఇష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది.
మరి ఆ పాత్రలో అతను ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటాడు. ప్రేక్షకులను మెప్పించే విధంగా ఆ పాత్ర ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక దాంతో పాటుగా ఒక యంగ్ క్యారెక్టర్ కూడా ఉంటుందట. మొత్తానికైతే రామ్ చరణ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్లో నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. సుకుమార్ మార్క్ మేకింగ్ తో ఈ సినిమా తెరకెక్కబోతోందట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా తొందరలోనే సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి.
మరి వాళ్ళు అనుకుంటున్నాట్టుగానే ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించగలుగుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఈ సినిమాతో రామ్ చరణ్ కి నేషనల్ అవార్డ్ రావడం పక్క అంటూ పలువురు అభిమానులు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…