మోదీకి మద్దతుగా నిలిచిన మెగాపవర్ స్టార్

దేశంలో కరోనా ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్డౌన్ అమలు చేస్తుంది. 21రోజుల లాక్డౌన్ అమలుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో కరోనాను కొంతమేర కట్టడి చేయగలిగాయి. అయినప్పటికీ గత రెండుమూడోరోజుల కరోనా కేసులు అత్యధికంగా నమోదువుతుడంతో తాజాగా దేశంలో 3వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాయశక్తులా కృషి చేస్తున్నాయి. వైద్యులు, పారిశుధ్య కార్మికులు, పోలీసులు కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తూ ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. లాక్డౌన్ అమలుకు ముందు ప్రధాని మోదీ […]

Written By: Neelambaram, Updated On : April 4, 2020 6:53 pm
Follow us on


దేశంలో కరోనా ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్డౌన్ అమలు చేస్తుంది. 21రోజుల లాక్డౌన్ అమలుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో కరోనాను కొంతమేర కట్టడి చేయగలిగాయి. అయినప్పటికీ గత రెండుమూడోరోజుల కరోనా కేసులు అత్యధికంగా నమోదువుతుడంతో తాజాగా దేశంలో 3వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాయశక్తులా కృషి చేస్తున్నాయి. వైద్యులు, పారిశుధ్య కార్మికులు, పోలీసులు కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తూ ప్రభుత్వానికి సహకరిస్తున్నారు.

లాక్డౌన్ అమలుకు ముందు ప్రధాని మోదీ ‘జనాతా కర్ఫ్యూ’ విధించగా ప్రజలు స్వచ్చంధంగా ఇళ్లలోనే ఉంటూ మద్దతు తెలిపారు. 14గంటలపాటు ప్రజలంతా ఇళ్లల్లోనే ఉంటూ కరోనా చైన్ పెరగకుండా కృషి చేశారు. అలాగే ప్రధాని పిలుపు మేరకు ఆరోజు సాయంత్రం 5గంటలకు ఇళ్ళ నుంచి బయటికి కరోనాపై పోరాడుతున్న వైద్యుల సేవలకు ప్రశంసిస్తూ కరతాళధ్వనులు చేసిన సంగతి తెల్సిందే. తాజాగా మరోసారి ప్రధాని మోదీ తన ట్వీటర్లో దేశ ప్రజలకు ఓ సందేశాన్ని విడుదల చేసింది.

దేశ ప్రజలంతా ఆదివారం రాత్రి 9గంటల 9నిమిషాలకు లైట్లను ఆర్పేసి దీపాలు వెలిగిద్దామంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ ట్వీట్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ట్విట్టర్ స్పందించారు. మన ప్రియతమ ప్రధాని చెప్పినట్టు ఆదివారం రాత్రి 9గంటలకు 9నిమిషాలకు ఇళ్లలోని లైట్స్ ఆఫ్ చేసి.. దీపాలు వెలిగించి ఆయన మాటను పాటిద్దామని చెర్రీ అన్నారు. ఎవ్వరూ మరిచిపోవద్దని కరోనా లేని ఇండియాను నిర్మిద్దామంటూ రాంచరణ్ తన ట్విటర్లో ట్వీట్ చేశారు. మోదీ ట్వీట్ పై మెగాస్టార్ కూడా ఈ విధంగానే స్పందించారు. ప్రధాని ఆదేశాలను మనమంతా పాటించాలని మెగాస్టార్ ట్వీటర్లో విజ్ఞప్తి చేశారు.