Homeఎంటర్టైన్మెంట్Ram Charan Sukumar Movie: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో ఆ ఇద్దరు సీనియర్...

Ram Charan Sukumar Movie: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో ఆ ఇద్దరు సీనియర్ హీరోలు…

Ram Charan Sukumar Movie: సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న నటుడు రామ్ చరణ్… చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికి చాలా తక్కువ సమయంలోనే టాప్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా తన అభిమానులకు ఏం కావాలో అలాంటి సినిమాలు చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నాడు. ముఖ్యంగా రంగస్థలం సినిమాతో తనలోని పూర్తిస్థాయి నటుడిని బయటికి తీసిన రామ్ చరణ్ మరోసారి సుకుమార్ దర్శకత్వంలోనే నటించడానికి సిద్ధమవుతున్నాడు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా డిఫరెంట్ వరల్డ్ లో ఉండబోతుందట. ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి కథతో సినిమా రాలేదంటూ సుకుమార్ చాలా స్ట్రాంగ్ గా చెబుతున్నాడు. కాబట్టి పక్కా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ ను నమోదు చేసే అవకాశాలైతే ఉన్నాయంటూ సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందు నుంచే అంచనాలైతే పెరిగిపోతున్నాయి. రీసెంట్ గా రామ్ చరణ్ చేసిన పెద్ది సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఈ సినిమాని ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ గా నిలపాలని అటు సుకుమార్, ఇటు రామ్ చరణ్ ఇద్దరు కూడా దృఢ సంకల్పంతో ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…

ఇక సుకుమార్ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. ఈ వర్క్ పూర్తవ్వగానే సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ మూవీ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ రాబడుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…నిజానికి సుకుమార్ సినిమాలంటే హీరోతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా సమానమైన క్రేజ్ ఉంటుంది. ఆయన అలాంటి క్యారెక్టర్ ను డిజైన్ చేస్తుంటాడు.

కాబట్టి అతని సినిమాలో నటించడానికి చాలామంది సీనియర్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ఆయన సినిమాలో ఒక ఇద్దరు స్టార్ హీరోలైతే నటించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మ్యాన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న రాజశేఖర్ ఈ సినిమాలో కీలకపాత్ర వహించబోతున్నాడు.

ఇక తనతో పాటుగా తమిళ్ హీరో అయిన శరత్ కుమార్ సైతం ఇందులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ ఈ సినిమాతో తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Bigg Boss 10 Telugu: పోలీస్ బిడ్డ.. ఆర్మీ బిడ్డ.. మధ్యలో జపాన్ బిడ్డ.. ‘బిగ్ బాస్...

Bigg Boss 10 Telugu: కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న 'బిగ్ బాస్ 10' సెప్టెంబర్ 6 న గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. గత ఏడాది...

Himalayan Disaster: హిమాలయాల్లో విపత్తు.. వాతావరణ మార్పులతో ముప్పు!

Himalayan Disaster: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. ఇంతకు ముందు డోడా, కిష్వార్‌ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌...

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...
Oktelugu Epaper
Exit mobile version