https://oktelugu.com/

Ram Charan- Sukumar: రామ్ చరణ్ సుకుమార్ కాంబో ఫిక్స్ మరోసారి చిట్టిబాబు గా చరణ్…

ఈ సినిమా మీద సౌత్ లోను, నార్త్ లోనూ మంచి అంచనాలు ఉన్నాయి.ఇక ఈ సినిమా కనక సక్సెస్ అయితే అటు అల్లు అర్జున్ కానీ, ఇటు సుకుమార్ గానీ ఇద్దరు కూడా పాన్ ఇండియా లెవల్లో టాప్ హీరో అండ్ టాప్ డైరెక్టర్లు గా ఎదగబోతున్నారనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : October 1, 2023 / 08:29 AM IST

    Ram Charan- Sukumar

    Follow us on

    Ram Charan- Sukumar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లుగా గుర్తింపు పొందిన వాళ్లలో సుకుమార్ ఒకరు. ఈయన తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి మంచి విజయాలను కూడా అందుకున్నాడు.ఇక అందులో భాగంగానే ఈయన 2018 వ సంవత్సరంలో రామ్ చరణ్ తో రంగస్థలం అనే సినిమా తీశాడు.ఆ సినిమా నాన్ బాహుబలి క్యాటగిరి కింద ఇండస్ట్రీ హిట్ కొట్టింది.

    దాంతో సుకుమార్ మొదటిసారిగా ఒక కమర్షియల్ సక్సెస్ ని అందుకొని ఇండస్ట్రీ హిట్టు కొట్టారు. ఆ తర్వాత ఆయన పుష్ప సినిమా చేసి పాన్ ఇండియా హిట్ కొట్టారు ఇప్పుడు పుష్ప 2 సినిమా చేస్తున్నారు.ఇక ఈ సినిమా తర్వాత ఆయన మళ్లీ రామ్ చరణ్ తో ఒక సినిమా చేస్తున్నాడు అనే విషయమైతే మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది…ఇక ఇంతకు ముందు సుకుమార్ తీసిన పుష్ప సినిమా ముఖ్యంగా నార్త్ లో చాలా ఎక్కువ కలక్షన్స్ ని రాబట్టిందనే చెప్పాలి.అయితే ఇక ప్రస్తుతం ఆయన అల్లు అర్జున్ తోనే పుష్ప 2 సినిమా చేస్తున్నాడు.

    ఈ సినిమా మీద సౌత్ లోను, నార్త్ లోనూ మంచి అంచనాలు ఉన్నాయి.ఇక ఈ సినిమా కనక సక్సెస్ అయితే అటు అల్లు అర్జున్ కానీ, ఇటు సుకుమార్ గానీ ఇద్దరు కూడా పాన్ ఇండియా లెవల్లో టాప్ హీరో అండ్ టాప్ డైరెక్టర్లు గా ఎదగబోతున్నారనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే సుకుమార్ పుష్ప 2 సినిమా తర్వాత ఆయన రామ్ చరణ్ తో చేసే సినిమా రంగస్థలం సినిమాకి సీక్వెల్ గా ఉంటుందా లేదంటే ఫ్రెష్ కథ తో మరో సినిమా చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ఈమధ్య జనాలకి సుకుమార్ అంటే విపరీతమైన నమ్మకం ఏర్పడుతుంది.ఎందుకంటే ఆయన వరుసగా ఆయన శిష్యులతో సినిమా తీసి హిట్టు కొట్టిస్తున్నారు. బుచ్చిబాబు తో ఉప్పెన తీయించి హిట్టు కొట్టించాడు.

    అలాగే ఆయన మరో శిష్యుడైన శ్రీకాంత్ ఓదెల కూడా దసరా సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. ఇక సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన విరూపాక్ష సినిమాకి కూడా సుకుమార్ స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేయడం విశేషం.ఇక ఆ సినిమాలో స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉండడం వల్లనే సినిమా సక్సెస్ అయింది అని ఇప్పటికే ఆ సినిమా డైరెక్టర్ అయిన కార్తీక్ దండు కూడా చెప్పడం జరిగింది. అయితే సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్ పైన ఇప్పటికే పలు రకాల చర్చలు అయితే నడుస్తున్నాయి. వీళ్ల కాంబోలో వచ్చే సినిమా రంగస్థలంకి సీక్వెల్ గా ఉంటుందా, లేదంటే మరో ఫ్రెష్ కథ తో వస్తారనే విషయం మీద మనందరికీ క్లారిటీ రావాలంటే ముందు పుష్ప 2 సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చెయ్యాలి… అప్పుడైతేనే సుకుమార్ కొంచెం ఫ్రీ అయి తన నెక్స్ట్ సినిమాకి సంభందించిన అప్డేట్ విషయాలను చెప్తాడు..