Boyapati Srinu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్లు కొన్ని సినిమాలు తీయడంలో స్పెషలిస్టులుగా ఉంటారు అందులో బోయపాటి శ్రీను ఒకరు… ఆయన మాస్ సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడు ఒక సినిమాని ఎమోషన్ తో ఎలా నడిపించాలి అనే విషయం ఆయనకి తెలిసినంత బాగా మరే డైరెక్టర్ కి తెలియదు.
అయితే ఈయన ఇప్పటివరకు తీసిన అన్ని సినిమాలు కూడా మాస్ ఫార్ములా తో వచ్చి మంచి విజయాలను అందుకున్న సినిమాలే కావడం విశేషం…ఇక ఇప్పటి వరకు బోయపాటి శ్రీను సినిమాలు చూసిన చాలా మంది అభిమానులు ఆయన ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటివరకు వరుసగా మాస్ సినిమాలు చేస్తూ విజయాలను అందుకుంటున్నారు ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ జానర్ మార్చకుండా ఒకే జానర్ లో ఒక డైరెక్టర్ వరుసగా సినిమాలు తీయడం వల్ల ఇంతకుముందు చూసిన సినిమానే మనం మళ్లీ చూస్తున్నమా అనే ఫీలింగ్ అభిమానులకి కల్గుతుంది.
అలాగే డైరెక్టర్ కూడా ఇంతకుముందు తీసిన సినిమా లాగానే ఈ సినిమా తీశాడు అంతే తప్ప ఈ సినిమాలో పెద్దగా కొత్తదనం ఏమి ఉంది అనే ఫీల్ కలుగుతుంది. కాబట్టి కనీసం రెండు,మూడు సినిమాలకు ఒకసారి అన్న ప్రతి డైరెక్టర్ ఒక జానర్ మార్చి ఇంకో రకమైన జానర్ లో సినిమాలను చేస్తూ ఉంటాడు. అది సక్సెస్ అవ్వగానే మళ్లీ తను ఏ జానర్ లో అయితే స్ట్రాంగ్ గా ఉంటాడో ఆ జానర్ లోనే సినిమాలు చేస్తాడు.అంతే కానీ వరుసగా ఒకే జానర్ లో పది సినిమాలు ఎవరు చేయరు. ప్రస్తుతం బోయపాటి తను తీసిన పది సినిమాలు కూడా అదే జానర్ లో ఉండడం వల్ల ఆయన సినిమాలు స్టీరియో టైప్ అయిపోయింది. దాంతో కొంతమంది జనం బోయపాటి సినిమాలు చూడాలంటే ఇంట్రెస్ట్ చూపించడం లేదు.
కాబట్టి ఇప్పటికైనా ఆయన కనీసం ఒక సినిమా అయిన జానర్ మార్చి తీయమని కోరుకుంటున్నారు అలా తీస్తే ఆయన సినిమాల మీద మళ్లీ మంచి అభిప్రాయం ఏర్పడటంతో పాటు ఆయన సినిమాలను కూడా చూడడానికి జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. లేదు అంటే ఈయన సినిమాలని ఒక కేటగిరికి చెందిన జనాలు మాత్రమే చూస్తారు తప్ప సినిమా ఇంట్రెస్ట్ ఉన్న జనాలు చూడలేరు… ఈసారైనా ఒక మంచి సినిమా చేసి బోయపాటి శ్రీను హిట్టు కొట్టాలని ట్రేడ్ పండితులు సైతం అభిప్రాయపడుతున్నారు…
ఇక మరికొందరు మాత్రం రాజమౌళి లాంటి డైరెక్టర్లు ప్రపంచం లో ఉన్న హాలీవుడ్ డైరెక్టర్లతో పోటి పడి సినిమాలు చేస్తుంటే బోయపాటి మాత్రం ఎంతసేపు అవే నరుకుడు, చంపేసే సినిమాలే చేస్తున్నాడు..