#RC15 Update: రామ్ చరణ్ తో అమృత్‌ స‌ర్‌ లో స్టార్ట్ చేసిన శంకర్ !

#RC15 Update: మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ హీరోగా విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా సినిమా రాబోతుంది. ఇప్పటికే ఈ పాన్ ఇండియా సినిమా మొదటి రెండు షెడ్యూల్స్ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. కాగా ఈ చిత్రం మూడో షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. ఈ కొత్త షెడ్యూల్ ను శంక‌ర్ అండ్ రామ్‌చ‌ర‌ణ్ టీం ఈ రోజు నుంచి అమృత్‌ స‌ర్‌ లో స్టార్ట్ చేసింది. అమృత్‌ […]

Written By: Shiva, Updated On : April 7, 2022 12:48 pm
Follow us on

#RC15 Update: మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ హీరోగా విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా సినిమా రాబోతుంది. ఇప్పటికే ఈ పాన్ ఇండియా సినిమా మొదటి రెండు షెడ్యూల్స్ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. కాగా ఈ చిత్రం మూడో షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. ఈ కొత్త షెడ్యూల్ ను శంక‌ర్ అండ్ రామ్‌చ‌ర‌ణ్ టీం ఈ రోజు నుంచి అమృత్‌ స‌ర్‌ లో స్టార్ట్ చేసింది.

RC15

అమృత్‌ స‌ర్‌ లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్స్‌ లో రామ్‌ చరణ్‌ పై ఫైటింగ్ సీన్స్‌ ను చిత్రీకరించనున్నారు. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ రాజకీయ నేతగా కనిపించనున్నాడు. అతనికి జోడీగా కియారా అద్వాణీ నటిస్తోంది. నిజానికి ఈ షెడ్యూల్ జనవరి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో చేయాలి. అయితే, అప్పుడు రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉండటంతో తప్పక షూటింగ్ పోస్ట్ ఫోన్ చేశారు.

ఆ తర్వాత మార్చిలో ప్లాన్ చేశారు. మళ్ళీ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో చరణ్ ఫుల్ బిజీగా ఉన్నాడు. అందుకే.. మళ్ళీ పోస్ట్ ఫోన్ చేశారు. ఎట్టకేలకు ఈ రోజు నుంచి షూట్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే గొప్ప విజువల్ సినిమాలను తీస్తూ.. పాన్ ఇండియా డైరెక్టర్ గా మార్కెట్ తెచ్చుకున్నాడు శంకర్. అయితే, ఈ సినిమాతో మరో స్థాయికి వెళ్లాలని ఆశ పడుతున్నాడు. వాస్తవానికి మొట్టమొదటి పాన్ ఇండియా డైరెక్టర్ శంకరే. అంత అద్భుతమైన రికార్డు ఉంది ఆయనకు.

Ram Charan

ఇక ‘రామ్ చరణ్ తో చేస్తోన్న ఈ భారీ బడ్జెట్ సినిమాని పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమా పై నేషనల్ వైడ్ గా విపరీతమైన బజ్ ఉంది. అన్నట్టు ఈ భారీ పాన్ ఇండియా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ద గ్రేట్ మ్యూజిక్డై రెక్టర్ రహమాన్ మ్యూజిక్ అందించబోతున్నాడు.

ఇక ఈ సినిమాలో మోస్ట్ హ్యాండ్సమ్ యాక్టర్ ‘అరవింద స్వామి’ మెయిన్ విలన్ గా నటించబోతున్నాడు. నిజానికి చరణ్ తో ఇప్పటికే అరవిందస్వామి ‘ధ్రువ’ సినిమాలో నటించాడు. ఈ కాంబినేషన్ బాగా సక్సెస్ అయ్యింది కూడా. ఇప్పుడు మరోసారి ఈ కలయికలో మరో భారీ సినిమా వస్తోంది అనేసరికి ఫ్యాన్స్ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Tags