Ram Charan removes Global Star tag: #RRR చిత్రం ఇతర దేశాల్లో కూడా సంచలన విజయం సాధించడం తో పాటు, ఆస్కార్ అవార్డు ని కూడా సొంతం చేసుకోవడం తో ఎన్టీఆర్(Junior NTR), రామ్ చరణ్(Global Star Ram Charan) మరియు రాజమౌళి(SS Rajamouli) లకు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఏర్పడింది. ఎన్టీఆర్ ని ఆయన అభిమానులు #RRR తర్వాత మ్యాన్ ఆఫ్ ది మాస్సెస్ అనే ట్యాగ్ తో పిలుస్తుంటే, రామ్ చరణ్ ఫ్యాన్స్ గ్లోబల్ స్టార్ అని పిలవడం మొదలు పెట్టారు. గ్లోబల్ స్టార్ ట్యాగ్ బాగా ట్రెండ్ అవ్వడం తో దర్శక నిర్మాతలు కూడా రామ్ చరణ్ కి ఆ ట్యాగ్ ఫిక్స్ చేసేసారు. ఆయన గత చిత్రం ‘గేమ్ చేంజర్’ మూవీ ప్రారంభానికి ముందు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అని ట్యాగ్ పడింది. అభిమానులు ఆ ట్యాగ్ ని అధికారికంగా సినిమాలో వేసినందుకు చాలా సంతోషించారు. కానీ ఆ ట్యాగ్ రామ్ చరణ్ కి అసలు కలిసి రాలేదు.
ఇండియాలో ఎంతో మంది సూపర్ స్టార్స్ ఉండగా, రామ్ చరణ్ ఒక్కడే గ్లోబల్ స్టార్ ఎలా అవుతాడు?, అసలు అంత పెద్ద ట్యాగ్ ని పొందే అర్హత రామ్ చరణ్ కి ఉందా?, రజినీకాంత్, షారుఖ్ ఖాన్ కంటే పెద్ద హీరోనా?, ఆయన సినిమాల అనుభవం ఎంత? అంటూ సోషల్ మీడియా లో రామ్ చరణ్ పై విపరీతమైన నెగిటివిటీ ఏర్పడింది. పైగా ‘గేమ్ చేంజర్’ పెద్ద ఫ్లాప్ అవ్వడం తో, ఆ నెగిటివిటీ ఇంకా తారాస్థాయికి చేరుకుంది. సన్నిహితులు దగ్గర నుండి కూడా ఈ గ్లోబల్ స్టార్ ట్యాగ్ పై ఫీడ్ బ్యాక్ బలంగా రామ్ చరణ్ కి బలంగా వెళ్లిందో ఏమో తెలియదు కానీ, ఆయన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది'(Peddi Movie) కి ఆ ట్యాగ్ ని తొలగించేసాడు. ఏ ట్యాగ్ అయితే రామ్ చరణ్ ని సూపర్ స్టార్ ని చేసిందో, ఆ మెగా పవర్ స్టార్ ట్యాగ్ ని పెద్ది సినిమాకు పెట్టుకున్నాడు.
రీసెంట్ గానే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న జాన్వీ కపూర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఇందులో ‘మెగా పవర్ స్టార్ రామ్ చరణ్’ అని రాసుంది. అంటే అభిమానులు ఎంతో ప్రేమగా పెట్టుకున్న ట్యాగ్ మళ్లీ రామ్ చరణ్ కి తిరిగి వచ్చేసింది. ఇప్పుడు రామ్ చరణ్ కి మళ్లీ పాత మంచి రోజులు తిరిగి వస్తాయో లేదో చూడాలి. పెద్ది రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఒక స్పోర్ట్స్ డ్రామా. ఈ సినిమా పై అభిమానుల్లోనే కాదు, ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీ లెవెల్ లోనే ఉన్నాయి. ఈ నెల 6న ఈ చిత్రం నుండి మొదటి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ అవుతుందని అంతా అనుకున్నారు కానీ, ఇప్పుడు రావడం లేదని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్.
