Homeఉద్యోగాలుNagendra Sai: ఏడాదిలో 13 కొలువులు.. ఈ కడప యువకుడికి ఎలా సాధ్యమైంది.. చేసిన కృషి...

Nagendra Sai: ఏడాదిలో 13 కొలువులు.. ఈ కడప యువకుడికి ఎలా సాధ్యమైంది.. చేసిన కృషి ఏంటి

Nagendra Sai: ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ రావడమే కష్టంగా ఉంది.. నోటిఫికేషన్లు వచ్చిన కాంపిటీషన్ చాలా ఎక్కువ. ఈ పరిస్థితులు పోటీపడి కొలువు పుట్టడం అంత సులభం కాదు. లక్షల మంది అభ్యర్థులు ఒకే పోస్టు కోసం పోరాడుతున్న నేపథ్యంలో, ఒక్క ఏడాదిలో 13 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం సాధారణ విషయం కాదు. ఆంధ్రప్రదేశ్ లోని కడపకు చెందిన నాగేంద్రసాయి అనే యువకుడు ఇలాంటి అసాధారణ విజయం సాధించి యువతకు కొత్త దిశ చూపించాడు.

నాగేంద్రసాయి నేపథ్యం..
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువు పూర్తి చేసిన నాగేంద్రసాయి తన దృష్టిని ప్రభుత్వ ఉద్యోగాల వైపు మళ్లించాడు. ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో చదివినా కూడా అతను తక్షణ ఉద్యోగం కోసం వేచి చూడకుండా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. తల్లిదండ్రులు కూడా ప్రోత్సాహించారు. కుటుంబ మద్దతు అతని విజయంలో కీలక పాత్ర పోషించింది.

ఒకేసారి అనేక విజయాలు..
స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వంటి వివిధ విభాగాల్లో అతను ఉద్యోగాలు సాధించాడు. ఒకే సంవత్సరంలో నాగేంద్రసాయి బహుళ పరీక్షలకు సమాంతరంగా సిద్ధమయ్యాడు. ప్రతి దానిలోనూ విజయం సాధించాడు. ఇది కేవలం అదృష్టం కాదు. ఒకే విషయంపై దృష్టి పెట్టకుండా విస్తృత సిలబస్‌ను కవర్ చేసి, వివిధ రకాల పరీక్షల ప్యాటర్న్‌లకు అనుగుణంగా పక్కా ప్రణాళికతో సన్నద్ధం కావడం అతని బలం. నిరంతర శ్రమ, అంకితభావంతో ఈ విజయం సాధించాడు. స్థిరమైన కృషి, క్రమశిక్షణ ఉంటే అసాధ్యమనిపించే లక్ష్యాలు కూడా చేరువవుతాయి. ఈనాటి పోటీ ప్రపంచంలో చాలా మంది ఒకటి రెండు వైఫల్యాల తర్వాత నిరాశ చెందుతారు. కానీ నాగేంద్రసాయిలా.. వైఫల్యాలను అధిగమించి మళ్లీ మళ్లీ ప్రయత్నించడం, ఒకేసారి అనేక అవకాశాలను వెతకడం ముఖ్యం.

యువతకు స్ఫూర్తి..
ఇది కేవలం ఒక వ్యక్తి విజయం మాత్రమే కాదు. ఇది ప్రస్తుత ఉద్యోగ వ్యవస్థలోని అవకాశాలు, సవాళ్ల గురించి కూడా చెబుతోంది. ఐఐటీ వంటి సంస్థల్లో చదివినవారు కూడా ప్రభుత్వ రంగాన్ని ఎంచుకోవడం, అందులోనూ అత్యున్నత స్థాయిలో విజయం సాధించడం యువతకు ధైర్యాన్ని ఇస్తుంది. అదే సమయంలో ఇది ఒక హెచ్చరిక కూడా.. కేవలం డిగ్రీ సరిపోదు నిరంతర అధ్యయనం, వ్యూహాత్మక తయారీ అవసరం.

నాగేంద్రసాయి విజయం కష్టపడితే ఫలితం రాకుండా ఉండదు అని నిరూపించింది. ఒకటి రెండు ఓటములకు కుంగిపోయే యువత లక్ష్యం పెట్టుకొని, కుటుంబ మద్దతుతో, క్రమం తప్పకుండా కృషి చేస్తే ఒకటి కాదు, అనేక అవకాశాలు తెరుచుకుంటాయి. నాగేంద్రసాయిలా తోపు అని నిరూపించవచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

RHA Movement: దేశవ్యాప్తంగా మరో ఉద్యమం.. ఈసారి అదే లక్ష్యం!

RHA Movement: సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన కాక్రోచ్ వ్యాఖ్యల నుంచి పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మొన్నటి వరకు సోషల్ మీడియా వేదికగా ఉద్యమించిన సీజీపీ నీటి...

YSRCP Rayalaseema: రాయలసీమలో వైసీపీకి కష్టమే!

YSRCP Rayalaseema: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ధీమా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అని ఆ పార్టీ భావిస్తోంది. ముఖ్యంగా రాయలసీమలో తమ పార్టీకి ఆదరణ పెరుగుతోందని.. పూర్వవైభవం ఖాయమని జగన్మోహన్...

AP MLC Elections 2026: రేపటితో ఆ ఇద్దరు.. ఏపీలో మొదలుకాని ఎమ్మెల్సీ ఎన్నికల సందడి!

AP MLC Elections 2026: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈనెల 28 తో గవర్నర్ కోటా కింద రెండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీకి సంబంధించి ఎన్నికల సంఘం...

Ellamma Cheruvu: కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కాదు.. తెలంగాణలో ఈ చెరువే దేశానికి ఆదర్శం

Ellamma Cheruvu: గోదావరి కిందికి పోతుంటే పైకి తీసుకొచ్చాం. వందల మీటర్లు గ్రావిటీకి వ్యతిరేకంగా ప్రవహించేలా చేసాం. లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. తాగునీటి అవసరాలు తీర్చాం. సాగునీటి అవసరాలు తీర్చాం....

Christopher Nolan: ది గ్రేట్ క్రిస్టోఫర్ నోలన్ కు నచ్చిన భారతీయ దర్శకుడు ఎవరో తెలుసా…

Christopher Nolan: క్రిస్టోఫర్ నోలన్.. ఈ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. ప్రముఖ దర్శకుడిగా తనదైన శైలిలో చిత్రాలను ప్రేక్షకులకు అందించాడు. అందులో భాగంగా ఇటీవల విడుదలైన 'ది ఒడిస్సీ'...
Oktelugu Epaper
Exit mobile version