spot_img
Homeఎంటర్టైన్మెంట్Ram Charan Peddi movie delay : జూన్ నెలకు వాయిదా పడిన 'పెద్ది'.. మేకర్స్...

Ram Charan Peddi movie delay : జూన్ నెలకు వాయిదా పడిన ‘పెద్ది’.. మేకర్స్ సంచలన ప్రకటన.. ట్వీట్ వైరల్..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) హీరో గా నటిస్తున్న ‘పెద్ది'(Peddi Movie) చిత్రం పై పాన్ ఇండియా లెవెల్ లో ఉన్నటువంటి క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈమధ్య కాలంలో ఏ రామ్ చరణ్ సినిమాకు లేనంత క్రేజ్ , బజ్ ఈ సినిమాకు ఏర్పడింది. కానీ మేకర్స్ ప్లానింగ్ లోపం వల్ల , ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. మార్చి 27 నుండి ఏప్రిల్ 30 కి వాయిదా పడిన ఈ చిత్రం, ఇప్పుడు ఏప్రిల్ 30 నుండి జూన్ నెలకు వాయిదా పడింది. కాసేపటి క్రితమే మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించారు. జూన్ నెల లో విడుదల చేస్తామని చెప్పారు కానీ , ఏ తేదీని విడుదల చేస్తారు అనే విషయం పై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అందుకు కారణం టాక్సిక్ చిత్రం.

జూన్ 4 న టాక్సిక్ చిత్రం విడుదల అవుతుందని ఆ సినిమా మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. కానీ ఇప్పుడు ఆ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. వాళ్ళ వైపు నుండి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత ‘పెద్ది’ ని జూన్ 4 కి విడుదల చెయ్యాలని చూస్తున్నారు మేకర్స్. ఒకవేళ టాక్సిక్ జూన్ 4 న విడుదలైతే , ‘పెద్ది’ చిత్రం జూన్ 24 న విడుదల అవుతుంది. ఈ విషయం పై రాబొయ్యే రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇకపోతే మేకర్స్ ఈ సందర్భంగా ఏమి మాట్లాడారో ఒకసారి చూద్దాం. వాళ్ళు మాట్లాడుతూ ‘పెద్ది చిత్రం నుండి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చినందుకు ప్రేక్షక దేవుళ్ళకు హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలుపుతున్నాము. పెద్ది కి సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తి అయ్యింది’.

‘కేవలం ఒక్క సాంగ్ షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ ఎడిట్ ని చూశాము . ఔట్పుట్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాము. కానీ ఇలాంటి గొప్ప కంటెంట్ లను, మేము ఇంకా గొప్పగా ప్రెజెంట్ చెయ్యాలని చూస్తున్నాము. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం మరింత సమయం కేటాయించాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి, ఈ చిత్రాన్ని జూన్ నెలకు వాయిదా వెయ్యాలని అనుకుంటున్నాము. త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తాము. ఇన్ని రోజుల నుండి ఈ సినిమా కొరకు మీరు చూపిస్తున్న , సహనానికి ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చారు. దీనిపై మెగా ఫ్యాన్స్ తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular