Ram Charan Peddhi Leak Video మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన తదుపరి సినిమా ‘పెద్ది’ కోసం దర్శకుడు బుచ్చిబాబు సానాతో కలిసి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉండగా, తాజాగా వీరిద్దరూ సినిమా షూటింగ్‌లో భాగంగా ఒక పెద్ద కొండ ఎక్కుతూ కష్టపడుతున్న వీడియో ఒకటి లీక్ అవ్వడం ఇప్పుడూ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
* కష్టంలో చరణ్, బుచ్చిబాబు: లీక్డ్ వీడియోలో ఏముంది?
లీక్ అయిన వీడియోలో, హీరో రామ్ చరణ్ ఒక పెద్ద కొండను ఎక్కుతూ, కొంచెం ఆపసోపాలు పడుతున్నట్లు కనిపించారు. ఆయన వెనుకాలే దర్శకుడు బుచ్చిబాబు తన అసిస్టెంట్లతో కలిసి, ఎంతో కష్టపడి కొండను అధిరోహించడానికి ప్రయత్నించడం కనిపించింది. ఈ దృశ్యాన్ని బట్టి చూస్తే, ‘పెద్ది’ సినిమా కోసం చిత్రబృందం ఎంతటి రిస్క్ తీసుకుంటోంది, ఎంతగా కష్టపడుతోందో అర్థమవుతోంది. సినిమాలో భారీ యాక్షన్, సాహసోపేత సన్నివేశాలు ఉండబోతున్నాయని ఈ వీడియో చెప్పకనే చెబుతోంది.
* ‘పెద్ది’తో బుచ్చిబాబు బిగ్ ప్లాన్!
నిజానికి, రామ్ చరణ్‌కు సరైన కథ, సరైన సినిమా పడితే, టాలీవుడ్‌లోని అన్ని రికార్డులూ చెరిగిపోతాయి. ఇపుడు ‘ఉప్పెన’ వంటి సూపర్ హిట్ అందించిన బుచ్చిబాబు.. ‘పెద్ది’ సినిమాతో అలాంటి పెద్ద ప్లానే వేసినట్టుగా ఈ లీక్డ్ వీడియో చూస్తుంటే స్పష్టమవుతోంది. కష్టపడి కొండ ఎక్కే ఈ దృశ్యాలు సినిమా అవుట్‌పుట్ ఏ స్థాయిలో ఉంటుందో అని ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
* వేట మొదలు పెట్టబోతున్న ‘వేటగాడు’ చరణ్
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గతంలో చెప్పినట్లుగా… రామ్ చరణ్ తన వేటను మొదలు పెడితే, మిగిలిన నక్కలు, తోడేళ్లు, ఇతర జంతువులు ఆ వేట కోసం ఎదురు చూడాల్సిందే. ఇప్పుడు ‘పెద్ది’ సినిమాతో చరణ్ ఆ భారీ వేటను మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. బుచ్చిబాబు దర్శకత్వం, చరణ్ అంకితభావం.. ఈ కాంబినేషన్ ‘పెద్ది’తో బాక్సాఫీస్ వద్ద సరికొత్త సునామీని సృష్టించడం ఖాయమనే నమ్మకాన్ని ఇస్తోంది.
గురూజీ చెప్పినట్టు చరణ్ వేట మొదలెడితే , ఆ మిగిలిన వేట కోసం నక్కలు , తోడేలు మిగతా జంతువులు ఎదురు చూస్తాయి #PEDDI on its way for a biggest blockbuster
— ArunKumar (@arunganta) October 17, 2025