Ram Charan upcoming movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. వాళ్ళు చేస్తున్న సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తనయుడు అయిన రామ్ చరణ్ ‘చిరుత’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికి ఆ తర్వాత నుంచి ఆయన వరుసగా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మైమరపింపజేస్తునాడు. ఇక ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో రామ్ చరణ్ అయితే ఉన్నాడు… ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్లో పెద్ది సినిమా చేస్తున్న రామ్ చరణ్ ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా క్లారిటీని మెయింటైన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన వరుసగా మూడు సినిమాలకు కమిట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినా కూడా ఆయన చేయబోయే మూడు సినిమాలు ఏంటి అనే విషయం మీద సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే వస్తున్నాయి. నిజానికి రామ్ చరణ్ సుకుమార్ తో ఒక సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక అతనితో పాటుగా సందీప్ రెడ్డివంగా డైరెక్షన్లో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు. ఇక వీళ్లిద్దరితోపాటు లోకేష్ కనకరాజు డైరెక్షన్లో కూడా ఒక సినిమా చేయడానికి ఆయన ఉత్సాహాన్ని చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం లోకేష్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు.
కాబట్టి ఆ సినిమా సక్సెస్ అయితే రామ్ చరణ్ లోకేష్ తో సినిమా చేస్తారట. లేకపోతే మాత్రం లోకేష్ ని పక్కన పెట్టి మరో తమిళ దర్శకుడితో సినిమా చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ ఇప్పుడు టాప్ రేంజ్ లో ముందుకు దూసుకెళ్తున్నాడు.
గత సంవత్సరం వచ్చిన గేమ్ చేంజర్ సినిమా తీవ్రమైన నిరాశను మిగల్చడంతో ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో చాలావరకు ఆచితూచి మరి ముందుకు అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా రిలీజ్ డేట్ మరోసారి పోస్ట్ పోన్ అయిన నేపథ్యంలో ఈ సినిమా జూన్ నెలలో వచ్చి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తుందనే నమ్మకంతో రామ్ చరణ్ అయితే ఉన్నాడు…